గల్లా ప్రసంగంలో పదే పదే తెలంగాణ ప్రస్తావన, అడ్డుపడిన ఎంపీ జితేందర్ రెడ్డి

TRS MPs Interrupts MP Galla Jayadev Speech In Lok Sabha
Highlights

ఇవాళ పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం సందర్భంగా టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ పదే పదే తెలంగాణ పేరును  ప్రస్తావించారు. దీంతో ఆయన ప్రసంగానికి తెలంగాణ టీఆర్ఎస్ ఎంపీలు అడ్డుతగిలే ప్రయత్నాలు చేశారు. తన స్పీచ్ లో భాగంగా గల్లా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుండి తెలంగాణ విభజన అన్యాయంగా, అన్ పార్లమెంటరీ పద్దతిలో జరిగిందన్నారు. ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ప్లోర్ లీడర్ జితేందర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంతో మంది తెలంగాణ యువకుల బలిదానాలతో తెలంగాణ వచ్చిందని జితేందర్ రెడ్డి అన్నారు. తాము అటు కాంగ్రెస్ పార్టీని, ఇటు బిజెపి లను ఒప్పించి పార్లమెంట్ లో విభజన బిల్లు పాసయ్యేలా చేశామని, అది అన్ పార్లమెంటరీ ఎలా అవుతుందని ప్రశ్నించారు. వెంటనే ఈ మాటలను రికార్డుల్లోంచి తొలగించాలని స్పీకర్ ను కోరారు.

అంతకు ముందు కూడా గల్లా జయదేవ్ తన ప్రసంగంలో తెలంగాణ గురించి ప్రస్తావించారు. ఉమ్మడి రాష్ట్ర విభజన వల్ల తక్కువ జనాభా ఉన్న తెలంగాణకు ఎక్కువ సదుపాయాలు, ఎక్కువ జనాభా ఉన్న ఏపికి తక్కువ సదుపాయాలు లభించాయని మండిపడ్డారు. విద్యుత్ కేటాయింపుల్లో కూడా ఏపి చాలా నష్టపోయిందన్నారు. విభజనకు ముందు ఏపికి హైదరాబాద్ నుండే ఎక్కువ ఆదాయం వచ్చేదని, ఇప్పుడు ఆ ఆదాయాన్నంత కోల్పోయామని తెలిపారు. హైదరాబాద్ ను అందరూ కలిసి  అభివృద్ది చేసుకున్నారమని కానీ అది కేవలం తెలంగాణ వశమైందన్నారు. 90 శాతం విద్యాసంస్థలు కూడా తెలంగాణలోనే ఉండిపోయాయని, విభజన తర్వాత ఏపికి కేంద్రం ప్రకటించిన విద్యాసంస్థల పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయని అన్నారు. అప్పులు ఏపికి, ఆస్తులు తెలంగాణ కు  మిగిలాయని గల్లా వ్యాఖ్యానించారు.  

పార్లమెంట్ సాక్షిగా ప్రధాని ఇచ్చిన హామీనే కేంద్రం నెరవేర్చడం లేదని గల్లా ఆవేధన వ్యక్తం చేశారు. వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో ఏపి బాగా వెనుకబడిపోయిందని, స్పెషల్ స్టేటస్ ఇచ్చి వుంటే ఈ రంగాల్లో వృద్ది ఉండేదన్నారు. ఏపికి స్పెషల్ స్టేటస్ ఇవ్వవద్దని ఏ ఫైనాన్స్ కమీషన్ చెప్పలేదని, కావాలనే కేంద్రం దీన్ని సాకుగా చూపుతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుకుంటే కేవలం ఆర్టికల్ 4 ద్వారా  ప్రత్యేక హోదా ఇవ్వొచ్చని తెలిపారు. ఇప్పటికైనా దయచేసి ఏపికి స్పెషల్ స్టేటస్ ప్రకటించాలని గల్లా కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాన మంత్రిని కోరారు.  
 
loader