కరీంనగర్: టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కరీంనగర్ జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కరీంనగర్ జిల్లా జిల్లాలోని ఉర్థూమీడియం పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఎంపి వినోద్ ఓటు వేశారు. 

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ఈ ఎన్నికలు ప్రజాచైతన్యానికి నిదర్శనమన్నారు. ఈసారి పోలింగ్ శాతం భారీగా పెరిగే అవకాశం ఉందని ఎంపీ వినోద్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.