Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు గురించి రాంమాధవ్ ఎందుకు మాట్లాడడంటే...: ఎంపి వినోద్

బిజేపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌పై టీఆర్ఎస్ ఎంపీ వినోద్ మండిపడ్డారు. తెలంగాన సీఎం కేసీఆర్ గురించి మాట్లాడే ముందు ఏపి సీఎం చంద్రబాబు నాయుడు అవినీతి గురించి  రాంమాధవ్ మాట్లాడితే బావుంటుందన్నారు. కానీ ఆ పని రాంమాదవ్ చేయలేరని...అలా చేయాలంటే చాలా విషయాలు అడ్డొస్తాయని వినోద్ తెలిపారు.

trs mp vinod fires on bjp leader ram madhav
Author
Hyderabad, First Published Oct 22, 2018, 6:36 PM IST

బిజేపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌పై టీఆర్ఎస్ ఎంపీ వినోద్ మండిపడ్డారు. తెలంగాన సీఎం కేసీఆర్ గురించి మాట్లాడే ముందు ఏపి సీఎం చంద్రబాబు నాయుడు అవినీతి గురించి  రాంమాధవ్ మాట్లాడితే బావుంటుందన్నారు. కానీ ఆ పని రాంమాదవ్ చేయలేరని...అలా చేయాలంటే చాలా విషయాలు అడ్డొస్తాయని వినోద్ తెలిపారు.

చంద్రబాబు నాయుడు తన ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టే రాంమాధవ్‌కు ఆయన అవినీతి కనిపించడం లేదని విమర్శించారు. చంద్రబబు అవినీతి పాలన గురించి అందరూ  ప్రశ్నిస్తున్నా...రాంమాధవ్ మాత్రం నోరు మెదపకపోవడానికి ప్రాంతీయాభిమానమే కారణమని వినోద్ ఆరోపించారు. 

ప్రాంతీయ పార్టీలను ఎదగనివ్వకుండా కాంగ్రెస్, బీజేపీ లు కుట్రలు పన్నుతున్నాయని అన్నారు. ఈ రెండు పార్టీలు ప్రజలకు చేసిందేమీ  లేదని... దొందూ దొందేనని విమర్శించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్, బీజేపీలను మట్టికరిపించి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని వినోద్ ధీమా వ్యక్తం చేశారు.   

ఆదివారం మల్కాజ్‌గిరిలో బీజేపీ కార్యకర్తలతో జరిగిన సమావేశానికి  బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామచంద్రరావుతో పాటు రాం మాధవ్ కూడా హజరయ్యారు. ఈ సందర్భంగా రాంమాధవ్ టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబ పాలనపై విమర్శలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 50 సీట్లు రావడం కూడా అనుమానమే అని అన్నారు.  రాంమాధవ్ వ్యాఖ్యలపై స్పందించిన వినోద్ పైవిధంగా విమర్శించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios