Asianet News TeluguAsianet News Telugu

యాసంగిలో వరిసాగు.. నలుగురూ, నాలుగు మాటలు మాట్లాడుతున్నారు, ఎవరిది నమ్మాలి : కేంద్రంపై నామా విమర్శలు

యాసంగిలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు టీఆర్ఎస్ (trs) ఎంపీ నామా నాగేశ్వరరావు (nama nageswara rao) . నలుగురు నాలుగు మాటలు మాట్లాడుతున్నారని.. ఇలా కాకుండా ఎవరో ఒకరు పార్లమెంట్‌లో స్టేట్‌మెంట్ ఇవ్వాలని నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఫుడ్ సెక్యూరిటీ, ఎఫ్‌సీఐ కేంద్రం ఆధీనంలో వుందని .. రైతుల ఇబ్బందులపై తాను ప్రశ్నించాలని చూస్తే కేంద్రం గొంతు నొక్కుతోందని ఆయన మండిపడ్డారు

trs mp nama nageswara rao slams center over paddy issue
Author
New Delhi, First Published Dec 2, 2021, 4:41 PM IST

యాసంగిలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు టీఆర్ఎస్ (trs) ఎంపీ నామా నాగేశ్వరరావు (nama nageswara rao) .  ఢిల్లీలో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తాము సభలో లేవనెత్తిన అంశాలను కేంద్రం పరిష్కరిస్తుందని అనుకున్నామన్నారు. 29 నుంచి నేటి వరకు తెలంగాణ రైతాంగం గురించి.. పార్లమెంట్ రెండు సభల్లోనూ ఒకటే డిమాండ్ వినిపించామని నామా అన్నారు. కానీ ఏ సభలోనూ ఖచ్చితమైన స్టేట్‌మెంట్ ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. తమ రైతాంగం ఎన్నో ఇబ్బందులు  పడుతోందని.. రెండు పంటల్లో ఒకటే తీసుకుంటామని అంటున్నారని నామా నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.

నలుగురు నాలుగు మాటలు మాట్లాడుతున్నారని.. ఇలా కాకుండా ఎవరో ఒకరు పార్లమెంట్‌లో స్టేట్‌మెంట్ ఇవ్వాలని నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఫుడ్ సెక్యూరిటీ, ఎఫ్‌సీఐ కేంద్రం ఆధీనంలో వుందని .. రైతుల ఇబ్బందులపై తాను ప్రశ్నించాలని చూస్తే కేంద్రం గొంతు నొక్కుతోందని ఆయన మండిపడ్డారు. తనకు లోక్‌సభలో (lok sabha) మైక్ ఇచ్చినట్లే ఇచ్చి కట్ చేస్తున్నారని నామా అన్నారు. అంతేకాకుండా తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు నోటికొచ్చినట్లు మాట్లాడారని ఆయన ఆరోపించారు. తెలంగాణ రైతుల సమస్య అని.. సంబంధిత మంత్రితో స్టేట్‌మెంట్ ఇప్పించాలని తాము కోరితే తమపై అనరాని మాటలు అన్నారని నామా నాగేశ్వరరావు ఆరోపించారు. కానీ తాము ఓపిగ్గా వుంటూ .. వాకౌట్ చేశామని ఆయన చెప్పారు. 

కాగా, రాష్ట్ర రైతాంగం పండించిన వరి ధాన్యం  కొంటారా లేదా అంటూ  పార్లమెంట్ ఉభయ సభల్లో కేంద్ర ప్రభుత్వాన్ని  నిలదీస్తూ  టీఆరెస్ ఎంపీలు బుధవారం నాడు నిరసనకు దిగారు.  రాజ్యసభ,లోక్ సభలో బైఠాయించి నిరసన తెలిపారు టీఆర్ఎస్ ఎంపీలు. Telangana రాష్ట్రంలో Paddy ధాన్యం కొనుగోలుపై  Trs ఎంపీలు ఆందోళనలు సాగిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన  రోజు నుండి  టీఆర్ఎస్ ఎంపీలు ఉభయ సభల్లోనూ తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. రైతులకు న్యాయం చేయాలంటూ పార్లమెంట్ లోపల ,బయట ప్లకార్డుల తో ఆందోళనలు చేస్తున్నారు. తెలంగాణ రైతాంగానికి న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని  టీఆర్ఎస్ ఎంపీలు  తేల్చి చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios