Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీలో పీఏలు లేరు.. కానీ, నిందితుల్లో ఒకరు నా డ్రైవరే : ఎంపీ మాలోత్ కవిత క్లారిటీ

ఎంపీ పీఏలమంటూ మోసాలకు పాల్పడుతున్న వారితో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత. ఢిల్లీలో అసలు తనకు పీఏలే లేరని ఆమె వెల్లడించారు. అరెస్ట్ అయిన వారిలో దుర్గేశ్ తన కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు. 

trs mp maloth kavitha comments on Taking Bribe At Her Delhi Home ksp
Author
New Delhi, First Published Apr 1, 2021, 6:24 PM IST

ఎంపీ పీఏలమంటూ మోసాలకు పాల్పడుతున్న వారితో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత. ఢిల్లీలో అసలు తనకు పీఏలే లేరని ఆమె వెల్లడించారు.

అరెస్ట్ అయిన వారిలో దుర్గేశ్ తన కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు. అందుకే దుర్గేష్‌కు తన స్టాఫ్ క్వార్టర్స్ ఇచ్చానని  కవిత చెప్పారు. దుర్గేష్ తప్పు చేసినట్లు తేలితే.. చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని ఎంపీ తెలిపారు. 

కాగా, ఢిల్లీలో తెలంగాణ ఎంపీ మాలోత్ కవిత పీఏలమంటూ పలువురి వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారు నిందితులు. ఢిల్లీలోని ఓ ఇంటి యజమాని నుంచి రూ.5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు.

ఇల్లు అక్రమంగా నిర్మిస్తున్నారంటూ బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు ముగ్గురు నిందితులు. రూ.లక్షతో సీబీఐకి పట్టుబడ్డారు. రాజీవ్ భట్టాచర్య, సుభాంగి గుప్తా, దుర్గేశ్ కుమార్‌లను అరెస్ట్ చేసింది సీబీఐ. మన్మిత్  సింగ్ లంబా ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది.

బాధితుడు సీబీఐకి ఫిర్యాదు చేయడంతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం లక్షకు అంగీకరించిన నిందితులు ఎంపీ మాలోత్ కవిత అధికారిక క్వార్టర్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే సీబీఐ అధికారులు సిద్ధంగా వుండటంతో వలపన్ని వారు పట్టుకున్నారు. దుర్గేశ్ కుమార్ అనే వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios