ట్రాఫిక్ శాఖకు టిఆర్ఎస్ ఎంపి మల్లారెడ్డి బాకీ ఎంతో తెలుసా?

ట్రాఫిక్ శాఖకు టిఆర్ఎస్ ఎంపి మల్లారెడ్డి బాకీ ఎంతో తెలుసా?

మల్కాజిగిరి పార్లమెంట్ టిఆర్ఎస్ ఎంపీ చామకూర మల్లా రెడ్డి ట్రాఫిక్ నిబంధనలు డోంట్ కేర్ అంటున్నారు. మల్లారెడ్డి వినియోగించే కారుపై వేలాది రూపాయలు ట్రాఫిక్ బకాయీలు ఉన్నాయి. అయినా ఆయన బకాయీలు చెల్లించడంలేదు. పోలీసులు సైతం ఆయన వాహనాన్ని సీజ్ చేయలేక భయపడుతున్నారు. ఆయన ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించాడని మీడియాలో కథనాలు రావడంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొద్దిగా స్పందించారు.

రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడంతో ఆయనకు ట్రాఫిక్ పోలీసులు రూ. 1335 ఛలాన్ విధించారు. ఆయన వాహనంపై ఇప్పటి వరకు మొతం రూ. 8945 ఛలాన్ లు పెండింగులో ఉన్నట్లు పోలీసు చెబుతున్నారు. ఇందులో అత్యధికంగా అతివేగానికి సంబంధించి రూ. 7000 ల ఛలాన్ లు పెండింగ్ లో ఉన్నాయన్నారు.

ధైర్య సాహసాలు చేసి ఛలాన్ లు విధించిన పోలీసులు మాత్రం వాహనం స్వాధీనం చేసుకోవడంలో విఫలమయ్యారు. సామాన్యులకు పెండింగ్ ఛలాన్ లు 1000 రూపాయలు దాటితే వాహనాన్ని స్వాధీనం చేసుకుని కోర్టుకు తరలిస్తారు. మరి ఎంపి గారు కాబట్టి 9వేల వరకు పెండింగ్ ఛలాన్లు ఉన్నా.. ఆయన జోలికి పోతలేరన్న విమర్శలు ఊపందుకున్నాయి.

 పోలీసులు... మల్లారెడ్డి విషయంలో చట్టం చుట్టమనే పద్ధతిని అవలంభిస్తున్నారని సామాన్య ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Telangana

Next page