భర్త పులకండ్ల శ్రీనివాసరెడ్డి చేతిలో దారుణంగా దాడికి గురైన సంగీత కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మల్కాజ్ గిరి ఎంపి మల్లారెడ్డి సీన్ లోకి ఎంటరయ్యారు. ఎలాగైనా ఆమె కేసును సెటిల్ చేసే విధంగా మల్లారెడ్డి బరిలోకి దిగినట్లు తెలుస్తోంది. దీక్ష చేస్తున్న సంగీత వద్దకు ఎంపీ మల్లారెడ్డి వచ్చి సంగీతను శాంతింపజేసే ప్రయత్నం చేశారు.

అయితే సంగీత వద్దకు రాకముందే ఎంపి మల్లారెడ్డి స్థానికంగా ఒక స్టార్ హోటల్ లో సంగీత భర్త తాలూకు కుటుంబసభ్యులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఎంపి మల్లారెడ్డితోపాటు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంగీతకు ఎలాంటి  న్యాయం చేయాలన్నదానిపై ఒక అవగాహనకు వచ్చారు. ఆమె డిమాండ్లపై చర్చించారు. ఏ రకమైన న్యాయం చేయాలి? సంగీతకు రక్షణ విషయంలో ఎలాంటి కమిట్ మెంట్ ఇవ్వాలన్నదానిపైనా చర్చించి అవాహనకు వచ్చినట్లు తెలిసింది.

 

అనంతరం సంగీత వద్దకు వచ్చిన ఎంపి మల్లారెడ్డి సంగీతను దీక్ష విరమించాలని సూచించారు. సంగీత డిమాండ్లన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సంగీతకు రక్షణ కల్పించడంతోపాటు ఆమె గౌరవం కాపాడేందుకు, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తదని స్పష్టం చేశారు. శ్రీనివాసరెడ్డి లంగా అని తేలిందని, అతడి కుటుంబానికి శిక్షపడేలా చూస్తామన్నారు. వాడికి నాలుగు ఇండ్లు ఉన్నాయని, వాటిలో ఒకటి సంగీత కూరుతు పేరుతో రిజిస్టర్ చేయిస్తామని హామీ ఇచ్చారు. ఎంపి మల్లారెడ్డి పలు సందర్భాల్లో నోరు జారడంతో స్థానిక మహిళలు, మహిళా సంఘాల నేతలు ఆయనను ఎగబట్కపోయారు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఘెరావ్ చేశారు.

ఇక మల్లారెడ్డి రంగంలోకి దిగడంతో సంగీత దీక్ష కొనసాగిస్తారా? విరమించే చాన్స్ ఉందా అన్న విషయంలో ఉత్కంఠత నెలకొంది. అయితే తన అత్త, మామ ను అరెస్టు చేసే వరకు దీక్ష కొనసాగిస్తానని ఆమె తేల్చి చెప్పారు.