తెలంగాణపై రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసే విషయమై న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నామని టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు చెప్పారు.

న్యూఢిల్లీ: Telanganaపై ప్రధాని Narendra Modi వ్యాఖ్యలు బాధించాయని TRS ఎంపీ కె. కేశవరావు చెప్పారు. 10 ఏళ్ల ఉద్యమం తర్వాతే విభజన బిల్లు ఆమోదం పొందిందన్నారు.. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణను కించపర్చేలా మాట్లాడారని Keshava Rao అభిప్రాయపడ్డారు. ప్రధాని మోడీ వ్యాఖ్యలపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చే విషయమై న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నామని కేశవరావు చెప్పారు.

దశాబ్దాల ఉద్యమం తర్వాతే తెలంగాణ బిల్లు పెట్టారని కేశవరావు గుర్తు చేశారు. తెలంగాణ బిల్లును Parliament లో పాస్ చేసిన సమయంలో పార్లమెంటరీ నియమ నిబంధనల మేరకే జరిగిందని ఆయన గుర్తు చేశారు. శాస్త్రీయం, అశాస్త్రీయం అనేది ఉండదన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో పాస్ చేసే సమయంలో కొందర సభ్యులు హంగామా చేసినింది నిజమేనని ఆయన ఈ సందర్భంగా మననం చేసుకొన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అయినా ఈ బిల్లుకు BJP మద్దతును ఇచ్చిందని కేశవరావు గుర్తు చేశారు.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం నాడు రాజ్యసభలో సమాధానమిచ్చారు. ఈ సమయంలో ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన గురించి మోడీ మాట్లాడారు. 

Andhra pradesh రాష్ట్ర విభజనపై కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి సమస్యలు వచ్చి ఉండేవి కావన్నారు. రాష్ట్ర విభజన సరిగా చేసి ఉంటే ఇలాంటి సమస్యలు వచ్చి ఉండేవి కావన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని ఆయన చురకలంటించారు. రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకం కాదని Prime Minister మోడీ స్పష్టం చేశారు. విభజన జరిగిన తీరును మాత్రం ఆయన తప్పుబట్టారు. ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసిందన్నారు. కేంద్రంలో అధికారంలోకి రావడానికి అవకాశం ఇచ్చిన ఏపీకి అన్యాయం చేశారని మోడీ గుర్తు చేశారు. హడావుడిగా రాష్ట్ర విభజన చేశారని మోడీ మండిపడ్డారు. 

Vajpayee ప్రధానిగా ఉన్న సమయంలో ఏర్పాటు చేసిన రాష్ట్రాల గురించి ఆయన గుర్తు చేశారు. ఆనాటి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకొన్న కారణంగానే ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి సమస్యలు రాలేదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొన్న హడావుడి నిర్ణయాలతో ఇబ్బందులు వచ్చాయన్నారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన సమయంలో చోటు చేసుకొన్న పరిణామాలను ఆయన గుర్తు చేశారు. విభజన వ్యవహరం ఎలా జరిగిందనేది కీలకమన్నారు. Parliament లో మైకులు కట్ చేసి తలుపులు మూసి బిల్లు పాస్ చేశారని ప్రధాని మోడీ విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇలా చేస్తారా అని మోడీ ప్రశ్నించారు. మీ అహంకారంతో తెలుగు రాష్ట్రాలకు నష్టం జరిగిందన్నారు గతంలో తాము ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏర్పాటు చేసిన మమయంలో శాంతియుత వాతావరణం ఉన్న విషయాన్ని మోడీ గుర్తు చేసుకొన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఈ తరహ చర్యలు తీసుకోలేదన్నారు. 

వరుసగా రెండు రోజూ కూడా కాంగ్రెస్ పార్టీ పై ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు గుప్పించారు. నిన్న లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించే సమయంలో కాంగ్రెస్ పై మండిపడ్డారు. ఇవాళ రాజ్యసభలో కూడా కాంగ్రెస్ పై మోడీ తీవ్ర విమర్శలు చేశారు. ఎమర్జెన్సీ నుండి ఏపీ రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరును మోడీ తప్పుబట్టారు. ఆయా సమయాల్లో కాంగ్రెస్ సరైన నిర్ణయాలు తీసుకొంటే సమస్యలు వచ్చేవి కావన్నారు.