ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే.. కోర్టులో తేల్చుకుంటాం: కవిత

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 30, Aug 2018, 4:31 PM IST
TRS MP kavitha fires on Opposition Parties
Highlights

ప్రతిపక్ష నేతలపై తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత ఫైరయ్యారు. ముందస్తు ఎన్నికలకు వెళుతున్న సంగతి తనకు తెలియదని.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని... చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గంలో రెండు కోట్ల రూపాయల నిధుల కంటే తక్కువ కేటాయించినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటామన్నారు. లేకపోతే తమపై విమర్శలు చేస్తున్న నేతలు తీసుకుంటారా అని కవిత సవాల్ విసిరారు. ఎన్నికల్లో ఓడిపోతామని ప్రతిపక్షాలు భయపడుతున్నాయని... కేసీఆర్ ఏం చేసినా ప్రతిపక్షాలకు భయమేనని.. వాళ్లు ప్రజల కోసం కాక.. పవర్ కోసం ఆలోచిస్తూ ఉంటారని విమర్శించారు.

ప్రజలు తమకు నూటికి నూరు మార్కులు వేశారని.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధమేనని స్పష్టం చేశారు. కొంగర కలాన్ సభకు టీఆర్ఎస్ ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకుంటోందని.. వూరకే తీసుకోవడం లేదని వెల్లడించారు. కేంద్రప్రభుత్వం జోనల్ వ్యవస్థను ఆమోదించడం సంతోషంగా ఉందన్నారు.

loader