కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు తాము ఎలాంటి దమ్కీలు ఇవ్వలేదని టీఆర్ఎస్ ఎంపీ కె. కేశవరావు చెప్పారు. రాజ్యసభను కూడా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తప్పుదోవ పట్టించారని ఆయన ఆరోపించారు.
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి Piyush Goyal కు తాము ఎలాంటి దమ్కీలు ఇవ్వలేదని రాజ్యసభలో టీఆర్ఎస్ పక్ష నేత కె. K.Keshava Rao స్పష్టం చేశారు.న్యూఢిల్లీలో సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో రెండు సార్లు Paddy పంట వస్తుందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. Boiled Rice ను ఎగుమతలు చేయడం లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ Rajya Sabha ను తప్పుదోవ పట్టించేా ప్రకటన చేశారన్నారు.
కానీ బాయిల్డ్ రైస్ ను కేంద్రం విదేశలకు ఎగుమతి చేస్తున్న విషయాన్ని అధికారిక వైబ్ సైట్ లో ప్రకటించిందన్నారు. రాజ్యసభను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించినందుకు గాను పీయూష్ గోయల్ పై Privilege Motion Notice ఇచ్చామన్నారు.ధాన్యం కొనుగోలుపై ఇతర రాష్ట్రాలు మాట్లాడుతున్నాయన్నారు. తమ రాష్ట్రంలో పండించిన వరి ధాన్యానికి ఎందుకు మార్కెట్ కల్పించడం లేదని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకు వస్తుంది. అయితే అన్ని రాష్ట్రాల్లోని ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టుగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
వరి ధాన్యం కొనుగోలు విషయమై రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ TRS సర్కార్ పై విమర్శలు చేశారు., రాజ్యసభ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. గత మాసంలో తెలంగాణ మంత్రులు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో సమావేశమైన తర్వాత మీడియా సమావేశంలో కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ తప్పు బడుతుంది.రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో నిరసనలు తెలిపారు..
వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతుంది. ధాన్యం కొనుగోలు అంశంపై రైతుల్లో చర్చ జరిగేలా టీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టింది. మరో మైపు రైతులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెచ్చగొట్టేలా చేసి వరి ధాన్యం పండించేలా చేశారని టీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. అంతేకాదు ప్రస్తుతం కేంద్రం ఇప్పుడు వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని టీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది.
వరి ధాన్యం కొనుగోలు అంశాన్ని తీసుకొని టీఆర్ఎస్, బీజేపీలు తమ రాజకీయ లబ్ది కోసం ప్రయత్నాలు చేస్తున్నాయని కాంగ్రెస్ విమర్శలు చేస్తుంది. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ కూడా ఆందోళనలు చేస్తుంది.
రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసే వరకు తెలంగాణ తరహ పోరాటం చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్ వరి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉందనే ప్రచారం కూడా లేకపోలేదు.
