హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను  టీఆర్ఎస్ కాపీ కొట్టిందని ఆ పార్టీ నేతలు చెప్పడం  హస్యాస్పదమని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్  చెప్పారు. ఆ పార్టీ మేనిఫెస్టోను రెడీ చేయకముందే తాము ఎలా కాపీ కొడతామని ఆయన ప్రశ్నించారు.

బుధవారం నాడు టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.  కాంగ్రెస్ పార్టీ నేతలకు క్షేత్రస్థాయిలో  ప్రజల నాడి తెలుసుకోకుండా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని  చెప్పారు.

గ్రౌండ్ గురించి తెలుసుకోకుండా గాంధీభవన్‌లో కూర్చొని  మైక్ దొరికితే  పూనకం వచ్చినట్టు మాట్లాడుతున్నారని  సుమన్ ఆరోపించారు.2014 ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను  అమలు చేసినట్టు చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఎవరెక్కడ ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నేతలకు తెలిపేందుకు గాను  ఆనాటి ఫోటోలను పంపాలని భావిస్తున్నట్టు చెప్పారు.

కేసీఆర్ నాయకత్వమే  తెలంగాణకు శ్రీరామరక్ష అని  సుమన్ అబిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ కు బంపర్ మెజారీటీ ఇవ్వాలని... ఇతర పార్టీ అభ్యర్థుల డిపాజిట్లు రాకుండా చూడాలని సుమన్ ప్రజలను కోరారు.