అదే నిజమైతే ఉరివేసుకుంటా.. బాల్క సుమన్

trs mp balka suman clarification on rumars
Highlights

లోయర్‌ ట్యాంక్‌బండ్‌లో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం సాక్షిగా ఉరేసుకుంటానని పేర్కొన్నారు. 

తనపై వచ్చిన ఆరోపణలను నిజమని నిరూపిస్తే.. తాను ఉరివేసుకుంటానని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్  అన్నారు. బాల్క సుమన్ ఇద్దరు మహిళలను లైంగికంగా వేధించారంటూ ఇటీవల ఆయనపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. అవన్నీ పచ్చి అబద్ధాలని సీఐ మహేశ్ తేల్చిచెపపారు.

కాగా.. ఈ విషయంపై బాల్క సుమన్ తాజాగా ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆధారాలతో రుజువు చేస్తే తాను ప్రాణత్యాగానికి సిద్ధమని టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌ ప్రకటించారు. లోయర్‌ ట్యాంక్‌బండ్‌లో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం సాక్షిగా ఉరేసుకుంటానని పేర్కొన్నారు. 

 ‘మంచిర్యాల పట్టణానికి చెందిన బోయిని సంధ్య, బోయిని విజేత అక్కాచెల్లెళ్లు. 6 నెలల కిందట సంధ్య నన్ను మోసం చేయాలన్న ఆలోచనతో నా భార్య, కుమారుడితో దిగిన ఫొటోలో.. భార్య స్థానంలో సంధ్య తన ఫొటోను మార్ఫింగ్‌ చేసింది. నన్ను బ్లాక్‌మెయిల్‌ కూడా చేసింది. ఈ విషయంపై మంచిర్యాల పోలీస్‌స్టేషన్లో జనవరి 27న ఫిర్యాదు చేయగా.. విచారణలో బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బు గుంజేందుకు ఫొటో మార్ఫింగ్‌ చేసినట్లు సంధ్య, విజేత అంగీకరించారు. సరైన ఆధారాలు సేకరించి ఇద్దరినీ పోలీసులు ఫిబ్రవరి 6న అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు’’ అని తెలిపారు. 

కాగా..ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు విజేత, సంథ్యలపై గతంలోనూ పలు ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. చాలామందిని ఇదేవిధంగా వీరిద్దరూ బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించారని పోలీసులు చెబుతున్నారు. 

loader