రాష్ట్రవ్యాప్తంగా వున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు సీఎం కేసీఆర్ ను కలిశారు. ప్రగతి భవన్ లో కేసీఆర్ తో  ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్ రెడ్డి(శాసన మండలి చీఫ్ విప్ ),కాటేపల్లి జనార్దన్ రెడ్డి ,పూల రవీందర్ ‌లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.  

ముఖ్యంగా ఏకీకృత సర్వీసులను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించడంపై వీరి మధ్య చర్చ జరిగింది. ఈ అంశంపై త్వరలోనే సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్సీలు వెల్లడించారు. 

ఇక రాష్ట్రవ్యాప్తంగా వున్న ప్రభుత్వ పాఠశాల్లో భాషా పండితులు,పిఈటీ లుగా పనిచేస్తున్న టీచర్లకు స్కూల్ అసిస్టెంట్ల హోదా కల్పించాలని కోరారు. అలాగే అంతర్ జిల్లాల బదిలీలను కూడా చేపట్టాలని ఎమ్మెల్సీలు సీఎంకు విన్నవించుకున్నారు. 

సీఎంతో సమావేశం అనంతరం ఎమ్మెల్సీలు మాట్లాడుతూ...తాము తెలిపిన సమస్యలన్నింటిపై సీఎం సానుకూలంగా స్పందించారని అన్నారు. త్వరలోనే ఉపాధ్యాయ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నామని ఎమ్మెల్సీలు ఆశాభావం వ్యక్తం చేశారు.