తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ సీట్ల బ్లాక్ జరిగాయని ఈ విషయమై విచారణ జరిపించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గవర్నర్ తమిళిసైకి లేఖ రాశారు.
హైదరాబాద్:టీపీసీసీ చీఫ్ Revanth Reddh మాట మీద నిలబడే వ్యక్తి కాదని ఎమ్మెల్సీ Palla Rajeshwar Reddy చెప్పారు.
ఆదివారం నాడు హైద్రాబాద్ లోని టీఆర్ఎస్ శాసనసభపక్ష కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణలో మెడికల్ సీట్లు బ్లాక్ చేసిన విషయమై దర్యాప్తు చేయించాలని తెలంగాణ గవర్నర్ Tamilisai Soundararajan లేఖ రాయడంపై మాట్లాడారు.
Medical సీట్లను బ్లాక్ చేసే వాళ్లకు యూనివర్శిటీ లేఖ రాస్తుందన్నారు. రాష్ట్రంలో మెడికల్ సీట్లను బ్లాక్ చేసే పరిస్థితి లేదన్నారు. బ్లాక్ చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందన్నారు. దందాలు చేసే వాళ్లపై కేసులు కూడా పెడతామని ఆయన హెచ్చరించారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు మేనేజ్ మెంట్ కోటా కింద సీటు ఇవ్వలేదన్నారు. మెడికల్ సీట్లు బ్లాక్ చేశారనే విషయమై దమ్ముంటే ఇంటర్నేషనల్ ఏజెన్సీతో దర్యాప్తు చేయించుకోవాలని పల్లా రాజేశ్వరర్ రెడ్డి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.తాను చెప్పిన అంశాలు తప్పని తేలితే రాజకీయాల నుండి తప్పుకొంటానని చెప్పారు. కొడంగల్ లో ఓటమి పాలైతే రాజకీయాల నుండి తప్పుకొంంటానని రేవంత్ రెడ్డి ప్రకటించాడన్నారు. కానీ రేవంత్ రెడ్డి రాజకీయాల నుండి తప్పుకోలేదన్నారు.
తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి చెందిన మమత కాలేజీలో మెడికల్ సీట్ల బ్లాక్ దందా సాగుతుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.ఈ విషయమై విచారణ జరపించాలని గవర్నర్ తమిళిసైకి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఈ విషయమై విచారణ జరిపించి విద్యార్ధులకు న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి కోరారు.ఈ విషయమై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు.
మమత వైద్య కళాశాలలో పీజీ మెడికల్ సీట్ల దందా జరుగుతోందంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గవర్నర్‌కు తప్పుడు ఫిర్యాదు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మంలో 20 ఏళ్లుగా నడుస్తున్న మమత మెడికల్ కాలేజీలో పీజీ అడ్మిషన్లు అత్యంత పారదర్శకంగా జరుగుతాయని ఒక ప్రకటనలో తెలిపారు. తన కాలేజీలో ఒక్కసీటునైనా బ్లాకు దందా చేసినట్లు రేవంత్‌రెడ్డి నిరూపిస్తే కాలేజీని రాష్ట్ర ప్రభుత్వానికి సరెండర్ చేస్తానని సవాల్ విసిరారు. ఒకవేళ నిరూపించలేని పక్షంలో రేవంత్‌రెడ్డి ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని పువ్వాడ డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో పీజీ అడ్మిషన్ల కౌన్సెలింగ్ సమయంలోనే తమ కాలేజీలో సీట్లు నిండిపోతాయని, అలాంటప్పుడు సీట్లు బ్లాక్ చేసి దందా చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వివరణపై రేవంత్ రెడ్డి ఏ మాత్రం తగ్గలేదు. తన వాదనలకు కట్టుబడి ఉన్నట్టుగా పేర్కొన్నారు.
మంత్రులకు చెందిన మెడికల్ కళాశాలల్లో జరుగుతున్న అవకతవకల విషయంలో తాను చేసే ఆరోపణల్లో వీసమెత్తు తప్పున్నా ఏ శిక్షకైనా సిద్ధమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. తన ఆరోపణలపై స్పందించిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు రేవంత్ సవాల్ విసిరారు. ‘మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ మెడికల్ కాలేజీల్లో మెడికల్ కౌన్సిల్‌తో ఒకే రోజు విచారణ జరిపించాలన్నారు. ఈ విషయమై తెలంగాణ గవర్నర్ తమిళిసైకి ఆయన లేఖ రాశారు. అవకతవకలు జరగలేదని నిరూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన చెప్పారు. ఈ ఒక్క పరీక్షకు నిజాయితీగా నిలవాలని అని రేవంత్ కోరారు.
