Asianet News TeluguAsianet News Telugu

మొన్న అన్న.. ఇప్పుడు చెల్లి, కోవిడ్ బారినపడ్డ కల్వకుంట్ల కవిత

టీఆర్ఎస్ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కరోనా బారినపడ్డారు . దీంతో ఆమె వెంటనే ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారు కోవిడ్ టెస్టులు చేయించుకోవాల్సిందిగా కవిత సూచించారు. 

trs mlc kalvakuntla kavitha tested positive for covid 19
Author
First Published Sep 12, 2022, 6:04 PM IST

టీఆర్ఎస్ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కరోనా బారినపడ్డారు. గత మూడు రోజులుగా కోవిడ్ అనుమానిత లక్షణాలతో ఆమె బాధపడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం వైద్య పరీక్షలు చేయించగా.. ఆమెకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమె వెంటనే ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారు కోవిడ్ టెస్టులు చేయించుకోవాల్సిందిగా కవిత సూచించారు. 

Also REad:మరోసారి కోవిడ్ బారినపడ్డ మంత్రి కేటీఆర్.. ఐసోలేషన్‌లోకి, నేతలకి సూచనలు

కాగా.. కొద్దిరోజుల క్రితం కవిత సోదరుడు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. ఆ వెంటనే ఐసోలేషన్‌కు వెళ్లిపోయినట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. కోవిడ్ లక్షణాలు కనిపించడంతో ఆయన వెంటనే టెస్టులు చేయించున్నారు. ఈ క్రమంలో తనకు పాజిటివ్‌గా తేలిందని మంత్రి తెలిపారు. గత కొన్నిరోజులుగా తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కేటీఆర్ సూచించారు. మంత్రి వైరస్ బారినపడటం ఇది రెండోసారి. గతేడాది ఏప్రిల్‌లోనూ ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఇకపోతే.. కొద్దిరోజుల కిందట కాలికి గాయం కావడంతో ఆయన ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios