ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి తనపై బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, మజీందర్ సిర్సాలు చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోర్టును ఆశ్రయించారు. తన పరువుకు భంగం కలిగించే ప్రకటనలు చేశారని.. బేషరతుగా క్షమాపణలు చెప్పేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు కవిత.
ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి తనపై బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, మజీందర్ సిర్సాలు చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఇంజెక్షప్ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ మద్యం పాలసీలో తనపై నిరాధార ఆరోపణలు చేశారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. తన పరువుకు భంగం కలిగించే ప్రకటనలు చేశారని.. బేషరతుగా క్షమాపణలు చెప్పేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు కవిత.
ఈ స్కాంతో తనకు సంబంధం లేకున్నా తనను అభాసుపాలు చేసే ఉద్దేశ్యంతో బీజేపీ నేతలు ఈ ప్రయత్నాలు చేశారని కవిత సోమవారం నాడు మండిపడ్డారు. తనపై ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు ప్రచారం చేశారని కూడా కవిత చెప్పారు.తనపై తప్పుడు ప్రచారం చేసిన బీజేపీ నేతలపై పరువు నష్టం దావా వేస్తానని కూడా కవిత ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆమె ఈ ఇద్దరు నేతలపై పరువు నష్టం దావా వేశారు. అంతేకాదు ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ నిర్వహించే దర్యాప్తు సంస్థలకు కూడా తాను సహకరిస్తానని కూడా కవిత వివరించారు.
ALso REad:లిక్కర్ స్కామ్‌పై ఆరోపణలు: బీజేపీ నేతలపై పరువు నష్టం దావా వేసిన కల్వకుంట్ల కవిత
ఇకపోతే.. ఢిల్లీలోని లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత పేరున్నందున వెంటనే ఆమె తన పదవికి రాజీనామా చేయాలని బీజేవైఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సోమవారం నాడు సాయంత్రం హైద్రాబాద్ బంజారాహిల్స్ లోని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిని ముట్టడించేందుకు బీజేవైఎం కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బీజేవైఎస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. మహిళా పోలీసులు బీజేపీ మహిళా విభాగం కార్యకర్తలను అరెస్ట్ చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. అదే విధంగా బీజేవైఎం కార్యకర్తలను కూడా పోలీసులు కవిత ఇంటి వైపునకు వెళ్లకుండా అడ్డుకున్నారు.
