గుండెపోటుతో మరణించిన టీఆర్ఎస్ సీనియర్ నేత, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. గురువారం మధ్యాహ్నం చిట్టాపూర్‌లోని ఆయన స్వగృహం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది.

దారి పొడవునా ప్రజలు, టీఆర్ఎస్ కార్యకర్తలు తమ అభిమాన నేతకు కన్నీటి నివాళుర్పించారు. అనంతరం రామలింగారెడ్డి వ్యవసాయ క్షేత్రం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీశ్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆయన పాడె మోశారు.

Also Read:రామలింగారెడ్డి భార్యకు టిక్కెట్టిస్తే ఏకగ్రీవం కోసం ప్రయత్నిస్తా: జగ్గారెడ్డి

అంతకుముందు రామలింగారెడ్డి భౌతికకాయానికి తెలంగాణ సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. ఆప్త మిత్రుడిని కోల్పోయానంటూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.

కాగా గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున రామలింగారెడ్డి మరణించారు.

Also Read:దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి: కేసీఆర్ నివాళులు

2004 మొదటిసారి దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన.. 2008, 2014, 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. జర్నలిస్ట్ నాయకుడిగా పలు ఉద్యమాల్లో పాల్గొనడంతో పాటు నక్సల్ ఉద్యమంలోనూ పాల్గొని పోలీసుల నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు.