టీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంపై వివక్ష చూపుతున్నారని ఆయన ఆరోపించారు. తన నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయడం లేదని రెడ్యానాయక్ వ్యాఖ్యానించారు.

ఆ నాడు తనకు వైఎస్ మంత్రి పదవిని ఇచ్చారని... తాను మంత్రి పదవి ఎవరి నుంచి గుంజుకోలేదని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే మీకూ మంత్రి పదవి వస్తుందని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

Also Read:సత్యవతి రాథోడ్ కు బెర్త్: కవిత, రెడ్యా అసంతృప్తి, కేటీఆర్ తో భేటీ

దీనిపై స్పందించిన రెడ్యా నాయక్ మీరు ఉండగా నాకు మంత్రి పదవి రాదంటూ కౌంటరిచ్చారు. రెడ్యానాయక్, ఎర్రబెల్లి సంభాషణపై రాజీకయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.