Asianet News TeluguAsianet News Telugu

ఆ మహిళలకు ముఖ్యమంత్రే భర్తలా మారి... మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య అనుచిన వ్యాఖ్యలు

బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం, టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య సీఎం కేసీఆర్ ను ప్రశంసించే క్రమంలో నోరుజారి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. 

trs mla rajaiah sensational comments on cm kcr
Author
Warangal, First Published Oct 3, 2021, 9:25 AM IST

వరంగల్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ను పొగిడే క్రమంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య (Rajaiah). స్టేషన్ ఘనపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తూ సీఎంను పొగుడుతూ... రాష్ట్రంలోని మహిళలందరికీ భర్త కూడా ఆయనే అయిపోయి చీరలు, బట్టలు అందిస్తున్నాడని అన్నారు. రాజయ్య పొరపాటుగా ఇలా నోరుజారి మాట్లాడినా సోషల్ మీడియాలో మాత్రం ఈ వీడియో తీవ్ర దుమారాన్ని రేపుతోంది.  

బతుకమ్మ, దసరా పండగ దగ్గపడుతున్న సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా తెలంగాణ సర్కార్ చీరల పంపిణీ చేపట్టింది. ఈ క్రమంలోనే జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలకేంద్రంలో మాజీ ఉపముఖ్యమంత్రి రాజయ్య బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఆయనే స్వయంగా కొందరు మహిళలను చీరలను కూడా అందించారు. 

ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ... కేసీఆర్ కిట్ బాలింతలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వం అందించే ఆ సూట్ కేస్ తెరవగానే చీరల బయటపడుతాయి. అందులో పసిబిడ్డకు ఉపయోగపడే వస్తువులు వుంటాయి. గతంలో ముక్కిపోయిన బట్టలు చిన్నారులకు ఉపయోగించేవారని... కానీ ఇప్పుడు పరిశుభ్రమైన బట్టలను ఉపయోగిస్తున్నారని అన్నారు. 

read more   రాంగ్ రూట్ లో కేటీఆర్ కారు: అడ్డుకున్న ట్రాఫిక్ ఎఎస్సై, తోసేసి గులాబీ దండు

ఇలా బాలింతలకు కొత్తబట్టలు అయ్యవ్వలు, మొగుడు, అత్తమామలు తేస్తలేరని... అన్నీ తానే అయి సీఎం కేసీఆర్ తెస్తున్నాడని అన్నారు. అమ్మా అయ్య, అత్తమామలు మాత్రమే కాదు భర్త కూడా ఆయనే అయి చీరలు, బట్టలు సిద్దం చేస్తున్నారని... అందుకే కేసీఆర్ ను మనసున్న మారాజు అనేది అంటూ రాజయ్య కొనియాడారు. 

సీఎంను పొగిడుతూ తాను ఏం మాట్లాడుతున్నది కూడా రాజయ్య మరిచారు. అయితే బాలింతలకు భర్త కూడా ముఖ్యమంత్రే అయ్యాడంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రాజయ్య వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా చక్కర్లు కొడుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios