నిలదీసే ప్రయత్నం చేసిన మహిళలు అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయిన ఎమ్మెల్యే రెడ్యానాయక్ టిఆర్ఎస్ కండవాలు వేసుకునే నిరసన తెలిపిన మహిళలు
అంతటి పేరున్న నేతకు సొంత నియోజకవర్గంలో జనాలు చుక్కలు చూపించారు. మహిళలు ఆయనపై విరుచుకుపడ్డారు. జై తెలంగాణ అంటూనే.. చెమటలు పట్టించారు. ఆ గిరిజన మహిళలకు స్థానిక రైతులు కూడా మద్దతు పలికారు. అందరూ కలిసి రెడ్యానాయక్ ను చుట్టు ముట్టారు. దీంతో దబ్బున అక్కడ ట్రాన్స్ ఫార్మర్ ఓపెనింగ్ తంతు ముగించి కారెక్కి తుర్రుమన్నారు రెడ్యానాయక్.
ఇక్కడ మరీ విచిత్రమేందంటే..? ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చిన మహిళలంతా అధికార టిఆర్ఎస్ పార్టీ కండవాలు కప్పుకునే నినాదాలు చేస్తున్నారు. ఈ షాకింగ్ వీడియో కింద ఉంది చూడండి.
