మరో వివాదంలో టిఆర్ఎస్ పుట్టా మధు (వీడియో)

trs mla putta madhu in another controversy
Highlights

మధు మాటలతో ళ్లీ వేడెక్కిన మంథని.. 

పెద్దపల్లి జిల్లాకు చెందిన మంథని ఎమ్మెల్యే పుట్టా మధు మరో వివాదంలో చిక్కుకున్నారు. మరోసారి ఆయన బ్రాహ్మణులపై మాటల దాడి చేశారు. మీరెంత? మీ సంఖ్య ఎంత అంటూ బ్రాహ్మణులపై విరుచుకుపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.

"

మంథనిలోని తమ్మ చెరువు పునరుద్ధరణ పనులలో భాగంగా శివాలయాన్ని కాంట్రాక్టర్ కూల్చేశారు. ఈ శివాలయ కూల్చివేతపై  మంథని సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ సభ జరిగింది. ఈ గ్రామసభలో పుట్టా మధుకు బ్రాహ్మణులకు మధ్య వాగ్వాదం జరిగింది. అయితే ఇదే నియోజకవర్గానికి చెందిన సునీల్ రెడ్డి అనే టిఆర్ఎస్ కీలక నేత కు ఎమ్మెల్యే పుట్టా మధుకు వాగ్వాదం నడిచింది. సునీల్ రెడ్డి గత ఎన్నికల్లో టిఆర్ఎస్ టికెట్ ఆశించగా అయనకు కాకుండా పుట్టా మధుకు దక్కింది. అందుకే ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఈసారి సునీల్ రెడ్డికి టికెట్ వస్తుందన్న ప్రచారం కూడా అక్కడక్కడ వినబడుతోంది. గ్రామసభలో ఒక దశలో సునీల్ రెడ్డి, పుట్టా మధు ఇద్దరు ఒకరినొకరు ఘాటుగా తిట్టుకునే వరకు వచ్చింది మ్యాటర్. ఇక్కడ బ్రాహ్మణులంతా సునీల్ రెడ్డికి మద్దతుగా ఉన్నారు. దీంతో సునీల్ రెడ్డిని, బ్రాహ్మణులను కలిపి పుట్టా మధు విమర్శలు చేసినట్లు చెబుతున్నారు.

మంథని లో మిషన్ కాకతీయ పనులలో భాగంగా తమ్మ చెరువు ను మినీ ట్యాంక్ బాండ్ గా మార్చుటకు ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించింది. పునరుద్ధరణ పనులు చేస్తూన్న కాంట్రాక్టర్ చెరువు కట్ట పై ఉన్న శివాలయాన్ని కూల్చవేసి నంది విగ్రహాన్ని ఎక్కడో పడవేశాడు. దీనికి నిరసనగా ఏర్పాటు చేసిన గ్రామసభలో రభస చోటు చేసుకుంది. ఎమ్మెల్యే పుట్ట మధుకు బ్రాహ్మణ సఘం నేతలకు తీవ్ర వాగ్వివాదం జరిగింది. బ్రాహ్మణులపై పుట్టా మధు కామెంట్స్ పైన వీడియోలో ఉన్నాయి చూడండి.

loader