Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ తెలంగాణ గాంధీ... ముట్టుకుంటే షాక్ తప్పదు..: నడ్డాకు జీవన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో నెంబర్ వన్ అంటూ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు చేసిన బిజెపి జాతీయ అధ్యక్షులు జెపి నడ్డాకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 

trs mla jeevan reddy strong counter to bjp president jp nadda
Author
Hyderabad, First Published Jan 5, 2022, 1:17 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హైదరాబాద్: తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ (bandi sanjay arrest) తో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయా (telangana politics)లు వేడెక్కాయి. ఉద్యోగుల పక్షాన జాగరణ దీక్ష (jagaran deeksha)కు దిగిన సంజయ్ పై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తూ అరెస్ట్ చేయడంపై రాష్ట్ర బిజెపి నాయకులే కాదు పార్టీ జాతీయ నాయకత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలోనే బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా మంగళవారం బిజెపి జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా (jp nadda) హైదరాబాద్ లో నిరసన చేపట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం (trs government), సీఎం కేసీఆర్ (KCR) పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

అయితే తమ పార్టీ, సీఎంపై జేపి నడ్డా చేసిన విమర్శలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (jeevan reddy) కౌంటరిచ్చారు. నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడు కాదు భ్రష్టా చార్ జనతా పార్టీ అధ్యక్షుడని ఎద్దేవా చేసారు. నడ్డా అబద్ధాల బిడ్డగా మారి మిషన్ భగీరథ ద్వారా నీళ్లు రాలేవంటున్నారు... ఇంతకన్నా హాస్యాస్పదం ఉంటుందా? అన్నారు. బిజెపి ఎమ్మెల్యేలు, ఎంపీల నియోజవర్గాల్లో ఎక్కడికైనా వెళదాం... అక్కడి ప్రజలు తమకు మిషన్ భగీరథ నీళ్లు రాలేదంటే దేనికైనా సిద్ధమని జీవన్ రెడ్డి సవాల్ విసిరారు. 

''నడ్డా సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ (bjp) ఒక లోకసభ, మూడు అసెంబ్లీ సీట్లను కోల్పోయింది. ఇలా సొంత రాష్ట్రంలో బీజేపీ ఓడిపోవడంతో నడ్డా మతి స్థిమితం కోల్పోయాడు. ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలి'' అని సూచించారు.

''కేసీఆర్ తెలంగాణ గాంధీ... ఆయన వ్యక్తి కాదు శక్తి... కేసీఆర్ ను బీజేపీ ముట్టుకుంటే షాక్ తప్పదు.  గాడ్సేలను మెచ్చుకుంటున్న వారు గాంధీ విగ్రహం దగ్గరకు వెళ్లడం సిగ్గుచేటు. బీజేపీకి దేశవ్యాప్తంగా గడ్డు రోజులు మొదలయ్యాయి'' అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హెచ్చరించారు. 

read more  టార్గెట్ 2023: బీజేపీ దూకుడు, ఆ రెండు పార్టీలకు చెక్‌ పెట్టేనా?

''నీతి ఆయోగ్ (NITI Ayog) నివేదికలు చదివితే తెలంగాణ రాష్ట్రం, సీఎం కేసీఆర్ గొప్పతనం నడ్డాకు తెలుస్తాయి.  తెలంగాణ లో అవినీతి జరిగితే నీతి ఆయోగ్ ఎందుకు అన్ని రంగాల్లో ప్రశంసలు కురిపిస్తోంది. మిషన్ భగీరథ (mission bhagiratha) నీళ్ళతోనే నడ్డాకు స్నానం చేపిస్తాం. బీజేపీ ఆఫీసులో తాగేది మిషన్ భగీరథ నీళ్లే... సంజయ్ జైల్లో తాగేది కూడా మిషన్ భగీరథ నీళ్లే. అయినా బండి సంజయ్ కు అదే స్క్రిప్ట్... అమిత్ షా, నడ్డాలకు ఒకే స్క్రిప్ట్ రాసి బీజేపీ నేతలు అభాసు పాలయ్యారు'' అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

''కాళేశ్వరం ప్రాజెక్టు (kaleshwaram project)లో ఎలాంటి అవినీతి జరగలేదని మేము కాదు కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (revanth reddy) అడిగిన ప్రశ్నకు కేంద్రమే పార్లమెంటులో సమాధానం చెప్పింది. అలాంటిది కాళేశ్వరం పై అడ్డదిడ్డంగా మాట్లాడిన నడ్డాను అర్జెంటుగా ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్చాలి. నడ్డా చేసిన ఆరోపణలు వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలి'' అని డిమాండ్ చేసారు.

''ఇంగ్లీషులో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్నీ కుంభకోణాలు చేసిన పార్టీ బీజేపీ. సెల్లర్స్, కిల్లర్స్ పార్టీగా బీజేపీ మారింది. బీజేపీ నేతలు తాలిబన్లలా మారారు. ఈ నిజాలు దాచిపెట్టి నడ్డా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు'' అని ఆరోపించారు.

''అరవింద్ (dharmapuri arvind).. ఇకనైనా తప్పుడు కూతలు మానుకో... ఇక ఆట మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం, పోలీసులపై అనుచితమైన భాష మాట్లాడుతున్న ఎంపీ అరవింద్ తో పాటు ఇతర బిజెపి నేతలపై పోలీసులు తక్షణమే పీడీ యాక్ట్ నమోదు చేయాలి'' అని జీవన్ రెడ్డి డిమాండ్ చేసారు. 

read more  బండి సంజయ్ అరెస్ట్ : కేసీఆర్, కేటీఆర్ లపై పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదుల వెల్లువ...

''నడ్డా కూడా సంజయ్ కన్నా అద్వాన్నంగా అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. నీ నక్రాలు ఆపు... తెలంగాణ లో నిన్ను నమ్మేందుకు బక్రాలు ఎవ్వరూ లేరు. నడ్డా... ఇది తెలంగాణ గడ్డ... కేసీఆర్ అడ్డా అని గ్రహించాలి''  అంటూ సెటైర్లు విసిరారు.

''గతంలో కేసీఆర్ కుటుంబం ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఇంతమంది కుటుంబసభ్యులు ఎందుకు పాల్గొంటున్నారు అని ఎవరైనా ఆడిగారా? బీజేపీ లో పదవుల్లో ఉన్న కుటుంబసభ్యుల చిట్టా చాలా పెద్దగా ఉంది. బీజేపీ నేతలకు బెంగాల్లో పట్టిన గతే తెలంగాణ లో పడుతుంది'' అన్నారు. 

''బండి సంజయ్ ఓ క్రిమినల్... .స్వాతంత్య్ర సమరయోధుడేమీ కాదు. ఆయనను అరెస్టు చేస్తే కొవ్వొత్తుల ర్యాలీ ఎందుకు. ఫ్రెండ్లీ పోలీసింగ్ తో బీజేపీ నేతల దుర్భాషలు ఎక్కువ అవుతున్నాయి. అందుకే పోలీసులు ఇక కఠినంగా వ్యవహరించాలి'' అని సూచించారు.

read more  టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టడమే లక్ష్యం.. పోరాటం మరింత ఉద్ధృతం : హైదరాబాద్‌లో జేపీ నడ్డా

''రేవంత్ కు మెంటలెక్కి బీజేపీ, టీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని ఆరోపిస్తున్నారు. అన్ని ఉపఎన్నికల్లో బీజేపీతో కుమ్మక్కయిన పార్టీ కాంగ్రెస్. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం ఎవరో కాంగ్రెస్, బీజేపీలే తేల్చుకోవాలి. కాంగ్రెస్ బీజేపీ లకు భవిష్యత్ లో ఇప్పుడున్న సీట్లు కూడా రావు'' అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

''సంజయ్ అరెస్టుతో తెలంగాణ ప్రశాంతంగా ఉంది. రూల్ ఆఫ్ లా ప్రకారం పోలీసులు నడుచుకుంటున్నారు. సంజయ్ పై ఎన్నో కేసులు ఉన్నాయి.. ఆయన నేర చరిత్రను బట్టే పోలీసులు వ్యవహరించారు.ఉరికించే దగ్గర ఉరికిస్తాం... ఊరుకునే దగ్గర ఊరుకుంటాం. డిపాజిట్లు కోల్పోయే పార్టీ బిజెపి టీఆర్ఎస్ తో ఏ యుద్ధం చేస్తుంది. బీజేపీ ఆట మొదలైంది... క్లోజ్ కూడా అయ్యింది'' అని జీవన్ రెడ్డి ఎద్దేవా చేసారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios