రామ్‌మాధవ్‌కు టీఆర్ఎస్ కౌంటర్: ఎవరి మగతనమెంతో తేల్చేందుకు ప్రజలు సిద్దం

TRS MLA jeevan Reddy reacts on Bjp leader Rammadhav comments
Highlights

ఎవరి మగతనమెంతో తేల్చేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ చేసిన విమర్శలకు ఆయన శుక్రవారం నాడు ఘాటుగా సమాధానమిచ్చారు. మగతనం నిరూపించుకోవాల్సింది బీజేపీ నేతలేనని చెప్పారు.

హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో  మా మగతనం ఏమిటో, మీ మగతనం ఏమిటో తేల్చేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ను ఉద్దేశించి టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి  వ్యాఖ్యానించారు.

శుక్రవారం నాడు ఆయన హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో మా మగతనాన్ని నిరూపించేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఆయన చెప్పారు. మీ పార్టీ మగతనాన్ని నిరూపించుకోవాలని ఆయన సూచించారు.

గత ఎన్నికల్లో మెదక్, వరంగల్ జిల్లాల్లో జరిగిన ఎన్నికల్లో  భారీ మెజారిటీతో తమ పార్టీ అభ్యర్ధులను ప్రజలు గెలిపించారని ఆయన గుర్తు చేశారు. మా మగతనాన్ని మేం నిరూపించుకొన్నామని ఆయన అభిప్రాయపడ్డారు. మీ మగతనం నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

అసలు విషయాన్ని పక్కనపెట్టి తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని ఆయన బీజేపీ నేతలకు హితవు పలికారు. బీజేపీ యాత్ర సందర్భంగా  ఏదో ఒకటి మాట్లాడాలనే ఉద్దేశ్యంతో ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఎవరి మగతనం ఎంతో తేల్చుకొనే అవకాశం త్వరలోనే ఉంటుందని ఆయన చెప్పారు. దీనికి సిద్దంగా ఉండాలని ఆయన సూచించారు.


 

loader