తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణకు ఊహించని అనుభవం ఎదురైంది. కూకట్ పల్లిలోని వై జంక్షన్ లో జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో సర్వే సత్యనారాయణపై స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తిట్టారు. నువ్వు అంటూ ఏకవచనంతో సంబోధించారు. నువ్వు ఎందుకు కలెక్టర్ ను తిట్టినవ్ అని సర్వేపై మాధవరం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు తోపులాడుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

అయితే అంతకుముందు కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణ మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డిపై చిందులేశారని, కలెక్టర్ ను అవమానించేలా మాట్లాడారని టిఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని సర్వేను అక్కడి నుంచి పంపించేశారు. మాధవరం కృష్ణారావు సర్వేను ఉద్దేశించి మాట్లాడిన మాటలు, తర్వాత గొడవ వీడియో పైన ఉంది చూడండి.