Asianet News TeluguAsianet News Telugu

కరోనా లక్షణాలు: ఆసుపత్రిలో చేరిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత

టీఆర్ఎస్ ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత కరోనా లక్షణాలతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. సునీతతో పాటు టెస్కాబ్ వైస్ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి కూడా ఆసుపత్రిలో చేరారు. అనంతరం వీరిద్దరూ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. 

trs mla gongidi sunitha hospitalized
Author
Hyderabad, First Published Jul 2, 2020, 10:56 PM IST

తెలంగాణలో కరోనా వైరస్ కేసులు  అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ మహమ్మారి బారిన పడుతున్న ప్రముఖుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు ప్రజాప్రతినిధులు దీని బారినపడ్డారు.

ఈ క్రమంలో టీఆర్ఎస్ ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత కరోనా లక్షణాలతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. సునీతతో పాటు టెస్కాబ్ వైస్ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి కూడా ఆసుపత్రిలో చేరారు. అనంతరం వీరిద్దరూ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. 

తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజే 1,213 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 18,750కి చేరింది.

ఇవాళ వైరస్ కారణంగా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడంతో.. మృతుల సంఖ్య 275కి చేరుకుంది. ప్రస్తుతం తెలంగాణలో 9,226 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇవాళ 987 మంది డిశ్చార్జ్ అవ్వడంతో 9,069 కోలుకున్నట్లయ్యింది. గురువారం ఒక్క హైదరాబాద్‌లోనే 998 మందికి పాజిటివ్‌గా తేలింది.

ఆ తర్వాత మేడ్చల్ 54, రంగారెడ్డి 48, ఖమ్మం 18, వరంగల్ (రూ) 10, వరంగల్ అర్బన్ 9, నల్గొండలో 8, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, భద్రాద్రిలో ఏడేసి కేసులు, కరీంనగర్, మహబూబాబాద్, నిజామాబాద్‌లో ఐదేసి కేసులు, సూర్యాపేట, ములుగు, జగిత్యాల, నిర్మల్‌లో నాలుగేసి కేసులు, సిరిసిల్ల 6, కామారెడ్డి, నారాయణ్‌పేటలో రెండేసి కేసులు, వికారాబాద్, గద్వాల, సిద్ధిపేట, మెదక్, యాదాద్రి, నాగర్ కర్నూల్‌లో ఒక్కో కేసు నమోదయ్యాయి

Follow Us:
Download App:
  • android
  • ios