హైదరాబాద్: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు జర్మనీ పౌరసత్వం ఉందని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.వేములవాడ ఎమ్మెల్యే  చెన్నమనేని రమేష్ కు జర్మనీ పౌరసత్వం కేసులో కేంద్ర హోంశాఖ మంత్రి గురువారం నాడు అఫిడవిట్ సమర్పించింది.

రోస్టర్ మారిన కారణంగా సంబంధిత బెంచ్ విచారణ జరుపుతోందని జస్టిస్ తెలిపారు.పదేళ్లుగా చట్టసభల్లో జర్మనీ పౌరుడు ఉండడాన్ని తీవ్రంగా పరిగణించాలని పిటిషనర్ తరపు లాయర్ తెలిపారు.పిటిషన్ ను త్వరగా తేల్చాల్సిన అవసరం ఉందని పిటిషన్ కోరారు.వీలైనంత త్వరగా సంబంధిత బెంచ్ ముందుంచాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశించింది.

2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చెన్నమనేని రమేష్ ఎన్నికను రద్దు చేసింది. అయితే ఈ విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించి రమేష్ స్టే పొందాడు. జర్మనీ పౌరసత్వాన్ని చెన్నమనేని రమేష్ కలిగి ఉన్నాడని వాదించాడు.

2014,2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించాడు. కేంద్ర హోంమంత్రిత్వశాఖ 2019లో భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.దేశంలో ద్వంద్వ పౌరసత్వం కోసం నిబంధనలు లేవు. ఎన్నికల్లో పోటీ చేయడానికి భారతీయ పౌరుడై ఉండాలి.