టిఆర్ఎస్ చెన్నమనేనికి కొద్దిగా రిలీఫ్

First Published 5, Jan 2018, 4:09 PM IST
trs mla chennamaneni gets six week relief on citizenship controversy
Highlights
  • పౌరసత్వం రద్దు కేసులో ఊరట
  • కేంద్ర నిర్ణయంపై హైకోర్టు స్టే
  • ఆరు వారాల పాటు కేంద్ర నిర్ణయం నిలిపివేత
  •  

టిఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు కొద్దిగా రిలీఫ్ దొరికింది. ఆయన భారత పౌరసత్వాన్ని కేంద్ర హోంశాఖ రద్దు చేసింది. ఆయన జర్మనీ పౌరసత్వం కలిగి ఉండడంతోపాటు ఆయన భారత పౌరుడు అనడానికి సరైన పత్రాలు లేని కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆయన పౌరసత్వం రద్దు చేసింది.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై చెన్నమనేని హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో ఆయనకు కొద్ది ఉపశమనం లభించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్స్ పై ఆరు వారాల పాటు స్టే విధించింది హైకోర్టు.

కేంద్ర ప్రభుత్వం చెన్నమనేని పౌరసత్వం రద్దు విషయంలో ఏకపక్షంగా వ్యవహరించిందన్న పిటిషనర్ వాదనలతో కోర్టు ఏకీభవించింది. ఆరు వారాలపాటు స్టే ఇస్తూ కేసును వాయిదా వేసింది. తర్వాత  కేసును పరిశీలిస్తామని న్యాయస్థానం తెలిపింది.

మొత్తానికి చెన్నమనేని పౌరసత్వం కేసు హైకోర్టు జోక్యంతో మరో మలుపు తిరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్ల చర్చ జరుగుతోంది.
 

loader