హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే వచ్చే లోకసభ ఎన్నికల్లో కారు దూసుకుపోయే పరిస్థితే కనిపిస్తోంది. శానససభ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 14 లోకసభ స్థానాల పరిధిల్లో మెజారిటీ ఓట్లు వచ్చాయి. ఈ 14 సీట్లను టీఆర్ఎస్ కచ్చితంగా గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

రాష్ట్రంలో 17 లోకసభ స్థానాలు ఉన్నాయి. వీటిలో ఖమ్మం, మహబూబాబాద్ లోకసభ స్థానాల్లో మాత్రమే కాంగ్రెసు మెజారిటీ సాధించింది. అది కూడా స్వల్ప మెజారిటీ మాత్రమే. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో అది పనిచేసి ఆ రెండు సీట్లను కూడా కాంగ్రెసు కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. 

హైదరాబాదు లోకసభ స్థానంలో మాత్రం టీఆర్ఎస్ మిత్ర పక్షం మజ్లీస్ 4.5 లక్షల పైచిలుకు మెజారిటీని సాధించింది. బిజెపి తన ప్రభావాన్ని చూపించలేకపోయింది. ఏ ఒక్క పార్లమెంటు స్థానంలో కూడా అది పోటీ ఇచ్చే పరిస్థితి లేదని ఓట్ల సరళిని పరిశీలిస్తే అర్థమవుతోంది. అయితే జాతీయ అంశాల ఆధారంగా, ప్రధాని మోడీ ఇమేజ్ ఆధారంగా బిజెపి ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది వేచి చూడాల్సిందే. 

ప్రస్తుత పరిస్థితిని చూస్తే టీఆర్ఎస్ 14, కాంగ్రెసు 1-2, మజ్లీస్ 1 పార్లమెంటు స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. ఖమ్మం లోకసభ స్థానం పరిధిలో కాంగ్రెసు మెజారిటీ 38 వేలు, మహబూబాబాద్ లో 9 వేలు టీఆర్ఎస్ కన్నా ఎక్కువ ఓట్లు సాధించింది. భువనగిరిలో 58 వేలు, పెద్దపల్లిలో 88 వేలు, నల్లగొండలో లక్ష ఓట్లు టీఆర్ఎస్ కన్నా కాంగ్రెసుకు తక్కువగా వచ్చాయి. ఈ ఐదు స్థానాల్లో కాంగ్రెసు టీఆర్ఎస్ కు పోటీ ఇచ్చే అవకాశం ఉంది. సికింద్రాబాదు లోకసభ పరిధిలో కూడా టీఆర్ఎస్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. అయితే, జాతీయ అంశాల ఆధారంగా జరిగే ఎన్నికలు కాబట్టి బిజెపి సికింద్రాబాదు స్థానాన్ని నిలబెట్టుకుంటుందా, లేదా అనే చూడాల్సి ఉంది. 

లోకసభ నియోజకవర్గాల వారీగా వివిధ పార్టీలకు వచ్చిన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి....

1. ఆదిలాబాద్

టీఆర్ఎస్ 5,14,936
కాంగ్రెసు 3,65,401
బిజెపి 1,46,555

2. భువనగిరి

టీఆర్ఎస్ 5,95,503
కాంగ్రెసు 5,37,374
బిజెపి 43,398

3. చేవెళ్ల

టీఆర్ఎస్ 6,48,684
కాంగ్రెసు 5,05,633
బిజెపి 1,05,912

4. హైదరాబాద్

మజ్లీస్ 4,56,602
టీఆర్ఎస్ 1,43,461
కాంగ్రెసు 1,09,056
బిజెపి 1,80,451

5. కరీంనగర్

టీఆర్ఎస్ 6,92,256
కాగ్రెసు 3,45,693
బిజెపి 1,02,027

6. ఖమ్మం

టీఆర్ఎస్ 5,18,194
కాంగ్రెసు 5,56,710
బిజెపి 9,764

7. మహబూబాబాద్ 
టీఆర్ఎస్ 4,90,575
కాంగ్రెసు 4,99,619
బిజెపి 21,364

8. మహబూబ్ నగర్

టీఆర్ఎస్ 5,77,724
కాంగ్రెసు 3,48,970
బిజెపి 62,859

9. మల్కాజిగిరి 

టీఆర్ఎస్ 8,26,956
కాంగ్రెసు 5,08,604
బిజెపి 1,48,555

10. మెదక్

టీఆర్ఎస్ 7,39,830
కాంగ్రెసు 3,78,877
బిజెపి 59,673

11. నాగర్ కర్నూలు

టిఆర్ఎస్ 6,36,002
కాంగ్రెసు 4,44,082
బిజెపి 86,813

12. నల్లగొండ

టీఆర్ఎస్ 6,06,127
కాంగ్రెసు 5,05,901
బిజెపి 52,525


13. నిజామాబాద్ 

టీఆర్ఎస్ 5,69,406
కాంగ్రెసు 3,41,389
బిజెపి 92,652

14. పెద్దపల్లి

టీఆర్ఎస్ 4,63,150
కాంగ్రెసు 3,75,023
బిజెపి 27,893

15. సికింద్రాబాద్

టీఆర్ఎస్ 4,29,390
కాంగ్రెసు 2,44,789
బిజెపి 1,72,188

16. వరంగల్ 

టీఆర్ఎస్ 6,71,766
కాంగ్రెసు 3,88,282
బిజెపి 38,821

17. జహీరాబాద్

టీఆర్ఎస్ 5,76,433
కాంగ్రెసు 4,43,468
బిజెపి 98,552