వరి కొనుగోలు (paddy procurement) విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్‌ఎస్ పార్టీ ఇందిరా పార్క్ (Indira park) వద్ద మహాధర్నా (TRS Maha Dharna) చేపట్టింది. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్ (cm kcr) ధర్నా వేదిక వద్దకు చేరుకున్నారు.
వరి కొనుగోలు (paddy procurement) విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్‌ఎస్ పార్టీ ఇందిరా పార్క్ (Indira park) వద్ద మహాధర్నా (TRS Maha Dharna) చేపట్టింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ మహా ధర్నా కొనసాగనుంది. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్ (cm kcr) ధర్నా వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ ధర్నాలో రాష్ట్ర మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్‌పీ చైర్మన్లు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఉదయం 10 గంటల వరకే మంత్రులు, టీఆర్‌ఎస్ ముఖ్య నేతలు ఇందిరా పార్క్ వద్దకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలులో కేంద్రం వైఖరితో రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని అన్నారు. ఇది ఆరంభం మాత్రమే.. అంతం కాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగం పట్ల, వ్యవసాయం పట్ల నిర్లక్ష్య వైఖరిని కలిగి ఉందని విమర్శించారు. ఈ పోరాటాన్ని చివరి వరకు కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఉత్తర భారతంలో రైతాంగం చేస్తున్న పోరాటాన్ని కలుపుకుని భవిష్యత్తులో కూడా పోరాటాన్ని ఉధృతం చేయాల్సి ఉంటుందని అన్నారు. రైతులకు ప్రయోజనం చేకూరే వరకు పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు. వివిధ పోరాట మార్గాల్ని ఎంచుకుని పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.
ధాన్యం కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అనేక సార్లు ఢిల్లీ వెళ్లి.. రైతుల గోసను వివరించారని సీఎం కేసీఆర్ చెప్పారు. పంజాబ్‌లో మాదిరిగానే తెలంగాణ రైతులు పండించే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని దండం పెట్టి కోరారని తెలిపారు. తాను కూడా వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిశానని.. కానీ ఎలాంటి స్పందన లేదని అన్నారు. నిన్న కూడా కేంద్రానికి లేఖ రాసినట్టుగా చెప్పారు. ఈ పోరాటం ఉప్పెనలా కొనసాగించి.. కేంద్రం దిగివచ్చేలా చేద్దామన్నారు. కరెంట్ బావుల వద్ద మీటర్లు పెట్టే విధానాన్ని మానుకోవాలని కోరారు.
సీఎం ధర్నాలు చేయడమేమిటనీ కొందరు మాట్లాడుతున్నారని.. 2006 లో గుజురాత్ ముఖ్యమంత్రి హోదాలో నరేంద్ర మోదీ 51 గంటల పాటు ధర్నాకు కూర్చొలేదా అని కేసీఆర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రులు ధర్నాలు కొనుగోలు చేసే పరిస్థితులు రాష్ట్రాల్లో నెలకొన్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ పోరాటం ఇక్కడితో ఆగదని... అవసరమైతే దిల్లీకి వెళ్లి.. చేయాల్సి ఉంటుందని అన్నారు.
ధర్నా అనంతరం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు తమ డిమాండ్లపై వినతిపత్రం సమర్పించనున్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు మరికొందరు ముఖ్య నేతలు గవర్నర్‌ను కలవనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా టీఆర్‌ఎస్ ధర్నాలు చేపట్టినప్పటికీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్నాలో పాల్గొనడం ఇదే తొలిసారి.
ఇక, ధాన్యం సేకరణ అంశం తెలంగాణలో రాజకీయంగా వేడిని రాజేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి టీఆర్‌ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే బీజేపీ, టీఆర్‌ఎస్ పోటా పోటీ ధర్నాలు చేపట్టాయి. గత వారం టీఆర్‌ఎస్ రాష్ట్రంలోని అన్ని జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అందులో టీఆర్‌ఎస్ ముఖ్యనేతలు పాల్గొన్నప్పటికీ.. సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. నేటి ధర్నాలో సీఎం కేసీఆర్ పాల్గొనడం ద్వారా.. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేశారు.
ప్రధాని మోదీకి లేఖ రాసిన కేసీఆర్..
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీకి (Narendra Modi) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) బుధవారం లేఖ రాసిన సంగతి తెలిసిందే. ధాన్యం కొనుగోళ్లకు (paddy procurement)సంబంధించి ఎఫ్‌సీఐకి (FCI) ఆదేశాలు ఇవ్వాలని కేసీఆర్ తన లేఖలో ప్రధానిని కోరారు. 2020-21 రబీలో మిగిలిన 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని వినతి చేశారు. 2021-22 ఖరీఫ్‌లో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా కొనుగోలు చేయాలని సీఎం ప్రతిపాదించారు. పంజాబ్ తరహాలో తెలంగాణలో కూడా ధాన్యం సేకరణ చేపట్టాలన్నారు.
వచ్చే యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం ఎంత వరిధాన్యం కొంటుందో ముందుగానే చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఎఫ్‌సీఐ తీరుతో రాష్ట్రాల్లో గందరగోళం నెలకొంది. రాష్ట్రాల నుంచి సేకరించే మొత్తంపై ఎఫ్‌సీఐ స్పష్టత ఇవ్వట్లేదని. ప్రతి ఏడాది ఉత్పత్తి పెరుగుతున్నా సేకరించే మొత్తం పెరగట్లేదు అని సీఎం లేఖలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి సత్వరమే చర్యలు తీసుకోవాలని విజ్జప్తి చేశారు కేసీఆర్.
