టిఆర్ఎస్ తీరు : చెక్కు అడిగితే తిట్లు.. పార్టీ నుంచి వేటు

TRS local episode: Not faces abusive language and also suspension
Highlights

నల్లగొండ టిఆర్ఎస్ లో కొత్త వివాదం

ఆయన పేరు గొట్టం కృష్ణారెడ్డి. ఆయన యువ రైతు. యాదాద్రి జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం, గౌరాయపల్లి గ్రామంలో నివశిస్తున్నాడు. తనకున్న ఆరు ఎకరాల పొలంలో 5 గుంటల జాగాలో కోళ్ల ఫారం ఏర్పాటు చేశారు. మిగతా భూమిలో వ్యవసాయం చేస్తున్నాడు. తెలంగాణ వచ్చిన తర్వాత వ్యవసాయానికి అనుబంధం చేశాడు.

రైతు బంధు పథకం కింద తనకు ఆరు ఎకరాల్లో 5 గుంటలు పోను మిగతా భూమికి చెక్కు వస్తదని అనుకున్నాడు. కానీ చెక్కు రాలేదు. కోళ్ల ఫారం ఉంది కాబట్టి రెవెన్యూ అధికారులు రైతుబంధు చెక్కు ఆపినట్లు ఆయనకు తెలిసింది. చెక్కు ఇప్పించాలంటూ స్థానిక ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతారెడ్డి దగ్గరకు పోయిండు. తన సమస్యను ఎమ్మెల్యేలకు వివరించాడు.

సీన్ కట్ చేస్తే ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి నీ సమస్య అలా ఎలా చెబుతావంటూ టిఆర్ఎస్ యాదగిరిగుట్ట మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య నోటికొచ్చినట్లు బూతులు తిట్టిండు. ఆ కర్రె వెంకటయ్య సతీమణి యాదగిరిగుట్ట జెడ్పీటిసి కూడా (ఫొటోలో ఇద్దరూ ఉన్నారు).

తిట్టి ఊకున్నరా అంటే అదీలేదు. టిఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని కృష్ణారెడ్డి ని ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ విధి విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తే ఎంతటి వారినైన క్షమించేది లేదంటూ పార్టీ నేతలు హెచ్చరించారు. టీఆర్ఎస్వి ఆలేరు నియోజకవర్గ అధ్యక్షులు ర్యాకల రమేష్ యాదవ్ ఈ మీడియా సమావేశంలో ఈ హెచ్చరిక జారీ చేశారు.

యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్వి నాయకుడు గొట్టం కృష్ణారెడ్డి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాలుపడుతున్నందున ఆరు సంవత్సరాల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు (సస్పెండ్) టీఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షులు ర్యాకల రమేష్ యాదవ్ శుక్రవారం యాదగిరిగుట్ట మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ కి కానీ టీఆర్ఎస్వి కి కానీ గొట్టం కృష్ణారెడ్డి కి ఎటువంటి సంబంధం లేదన్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే ఎంతటి వారినైన సహించేది లేదని తెలిపారు. ఈ సమావేశంలో యాదగిరిగుట్ట మండల టిఆర్ఎస్వీ అధ్యక్షులు గోపాగాని ప్రసాద్ గౌడ్, టీఆర్ఎస్వి  నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మిట్ట అరుణ్ గౌడ్, పట్టణాధ్యక్షులు మిట్ట అనిల్ గౌడ్, శారాశి రాజేష్, కార్యదర్శి దయ్యాల భరత్, కాటమైన వినయ్ ముదిరాజ్ పాల్గొన్నారు.

కృష్ణారెడ్డిని మండల టిఆర్ఎస్ అధ్యక్షులు వెంకటయ్య తిట్టిన ఆడియో రికార్డు కింద ఉంది వినండి.

"

 

loader