టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికై వివిధ పార్టీల్లో చేరిన నేతలపై వేటు వేయ్యాల్సందిగా టీఆర్ఎస్ నేతలు శాసనమండలి ఛైర్మన్‌ను కోరారు. ఇవాళ ఉదయం టీఆర్ఎస్ చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డిలు శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్‌ను కలిసి పార్టీ మారిన ఎమ్మెల్సీలపై ఫిర్యాదు చేశారు.

వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎమ్మెల్సీలు కొండా మురళీ, భూపతిరెడ్డి, యాదవరెడ్డి, రాములు నాయక్ ఇతర పార్టీల్లోకి వెళ్లారని.. వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ... వీరిలో ఇద్దరు ఎమ్మెల్సీలు స్థానిక సంస్థల కోటాలో ఎన్నికయ్యారన్నారు.

 మిగిలిన వారు గవర్నర్, ఎమ్మెల్సీల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై ఫిరాయింపులకు పాల్పడ్డారని వారు తెలిపారు. పార్టీ నియమావళికి వ్యతిరేకంగా నలుగురు వ్యవహరించారని, వీరిపై వేటు వేయాలని కోరారు. పార్టీ మారే సమయంలో ఇచ్చిన స్టేట్‌మెంట్ల ఆధారంగా ఛైర్మన్‌కు ఫిర్యాదు చేసినట్లు టీఆర్ఎస్ నేతలు వెల్లడించారు.

"