హైదరాబాద్ రాంకోఠిలోని రూబీ గార్డెన్స్ లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీతో పాటు గోశామహల్ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే తనను వేదిక పైకి పిలవలేదంటూ ఉద్యమకారుడు ఆర్వి మహేందర్ కుమార్ ఆంతోళనకు దిగారు. అతన్ని మరో నాయకుడు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగింది. దీంతో మంత్రి చూస్తుండగానే ఇద్దరు నాయకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. 

వీడియో

"

హోంమంత్రి ఇరు వర్గాలను సముదాయించడంతో కాస్సేపు గొడవ సద్దుమణిగింది. అయితే ఈ సమావేశం అనంతరం మంత్రి వెళ్లిపోగానే ఇదే టీఆర్ఎస్ నాయకులు మరోసారి రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సమావేశ ప్రాంతం నుండి రోడ్డుపైకి వెళ్లి మరీ తన్నుకున్నారు.