Asianet News TeluguAsianet News Telugu

ఖైరతాబాద్ లో ఉద్రిక్తత: బీజేపీ,టీఆర్ఎస్ కార్యకర్తల గొడవ

తెలంగాణ అసెంబ్లీ పోలింగ్ సందర్భంగా పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కట్టదిట్టమైన భారీ భద్రత ఏర్పాటు చేసినప్పటికీ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటున్నాయి. 

trs leaders attcked on bjpleader in khairatabad
Author
Hyderabad, First Published Dec 7, 2018, 9:04 AM IST

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ పోలింగ్ సందర్భంగా పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కట్టదిట్టమైన భారీ భద్రత ఏర్పాటు చేసినప్పటికీ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటున్నాయి. 

ఖైరతాబాద్ నియోజకవర్గం ఇందిరానగర్ పోలింగ్‌బూత్‌లో బీజేపీ కార్యకర్తపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఖైరతాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్‌ పార్టీ కండువా ధరించి ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చారు. 

కండువా వేసుకుని పోలింగ్ కేంద్రానికి రావడంతో బీజేపీ కార్యకర్త ప్రదీప్ దానం నాగేందర్ ను ప్రశ్నించారు. పార్టీ కండువా కప్పుకుని ఎలా వస్తారంటూ నిలదీశారు. దీంతో అతడిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. సమాచారం తెలుసుకున్న బీజేపీ అభ్యర్థి  చింతల రామచంద్రారెడ్డి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios