కోరుట్ల: నిజామాబాద్ ఎంపీ కవితపై  సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ  మధు యాష్కీ‌పై  కోరుట్ల మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మంగళవారం నాడు ఆయన   ఈ విషయమై స్పందించారు.  కవితపై అవాకులు చెవాకులు పేలుతున్న మధు యాష్కీ నాలుక కోస్తామని విద్యాసాగర్ రావు హెచ్చరించారు. 

కవితపై పిచ్చి మాటలు మాట్లాడడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆడపడుచుపై పిచ్చి మాటలు మాట్లాడకూడదని విద్యాసాగర్ రావు సూచించారు.

కేసీఆర్ కుటుంబం ఆస్తులు విపరీతంగా పెరిగాయని...కవిత కూడ బెంగుళూరులో విల్లాలను  కొనుగోలు చేసిందని  ఇటీవల మధు యాష్కీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ విమర్శలపై  కవిత మధు యాష్కీకి లీగల్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే.

"