కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాబెజ్జంకి మండలం నుండి జడ్పీటీసీగా పోటీ చేసేందుకు  టిక్కెట్టు దక్కనందుకు మనోవేదనకు గురైన శంకరయ్య అనే టీఆర్ఎస్ నేత సోమవారం నాడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని బెజ్జంకి మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన శంకరయ్య  తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనేవాడు. బెజ్జంకి నుండి జడ్పీటీసీగా పోటీ చేసేందుకు ఆయన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను సంప్రదిస్తే ఆయన నిరాకరించినట్టుగా తెలుస్తోంది. 

 దీంతో మనోవేదనకు గురైన శంకరయ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో శంకరయ్యను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. శంకరయ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.