Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ: బంపరాఫర్ కొట్టేసిన కౌశిక్ రెడ్డి... గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా ఛాన్స్ ... !!

కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి చేరిన కౌశిక్ రెడ్డికి బంపరాఫర్ దక్కింది. తెలంగాణలో ఖాళీ అయిన గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ‌గా కౌశిక్ రెడ్డిని ప్రతిపాదిస్తూ గవర్నర్ తమిళిసైకి దస్త్రాన్ని పంపారు. 

trs leader koushik reddy nominated as mlc for governor quota ksp
Author
Hyderabad, First Published Aug 1, 2021, 10:20 PM IST

కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి చేరిన కౌశిక్ రెడ్డికి బంపరాఫర్ దక్కింది. తెలంగాణలో ఖాళీ అయిన గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ‌గా కౌశిక్ రెడ్డిని ప్రతిపాదిస్తూ గవర్నర్ తమిళిసైకి దస్త్రాన్ని పంపారు. 

కాగా, కాగా, తెలంగాణ రాజకీయాలలో కౌశిక్ రెడ్డి వ్యవహారం దుమారం రేపిన విషయం తెలిసిందే. హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ తనకు టికెట్ ఇస్తున్నట్లుగా మాట్లాడిన ఆడియో వైరల్ అయ్యింది. ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేగింది. శరవేగంగా చోటుచేసుకున్న పరిణామాలలో భాగంగా కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేయడం, ఆ వెంటనే కౌశిక్ రెడ్డికి రాజీనామా చేయడం జరిగిపోయింది.

ALso Read:కేసీఆర్ హుజూరాబాద్ ఆపరేషన్: టీఆర్ఎస్ లోకి పెద్దిరెడ్డి, ఇటీవలే కౌశిక్ రెడ్డి

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నేతలపై ముఖ్యంగా రేవంత్ రెడ్డి, మాణిక్యం ఠాగూర్‌లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  ఠాగూర్ కు 50 కోట్ల రూపాయలు ఇచ్చి రేవంత్ రెడ్డి పదవి కొనుక్కున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. అంతేకాకుండా మాణిక్యం ఠాగూర్ యూజ్ లెస్ ఫెలో అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై సీరియస్ అయిన మాణిక్యం ఠాగూర్ లీగల్ నోటీసులు పంపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios