హైదరాబాద్ కేటిఆర్ పర్యటనలో అపశృతి (వీడియో)

First Published 5, Jan 2018, 1:29 PM IST
trs leader injured in freak accident during minister ktr tour
Highlights
  • కేటిఆర్ ర్యాలీలో ప్రమాదం.. 
  • బిఎన్ రెడ్డి కాలనీలో ఘటన
  • గాయపడిన ఎల్పీ నగర్ ఇన్ఛార్జి ముద్దసాని రామ్మోహన్ గౌడ్

హైదరాబాద్ లోని ఎల్ బి నగర్ నియోజకవర్గంలో మంత్రి కేటిఆర్ పర్యటినలో అపశృతి దొర్లింది. నియోజకవర్గంలోని వనస్థలిపురం, బిఎన్ రెడ్డి ఏరియాలో కేటిఆర్ శుక్రవారం పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన ర్యాలీలో ఎల్ బి నగర్ నియోజకవర్గ టిఆర్ఎస్ ఇన్ఛార్జి ముద్దగోని రామ్మోహన్ గౌడ్ స్వల్పంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.

వనస్థలిపురం బీ యన్ రెడ్డి నగర్ లో KTR కాన్వాయ్ ముందుకు వెళ్లుండగా స్వల్ప ప్రమాదం జరిగింది. ముద్దసాని రామ్మోహన్ గౌడ్ ప్రయాణిస్తున్న వాహనం ముందు ఉన్న వాహనాన్ని డ్రైవర్ ఒక్కసారి బ్రేక్ వేసి నిలిపివేశాడు. దీంతో వెనకాలే ఓపెన్ జీప్ వాహనంలో ప్రయాణిస్తున్న ముద్దసాని రామ్మోహన్ గౌడ్ కు గాయాలయ్యాయి. ఓపెన్ జీపు ముందుగా ఉన్న కారును ఢీకొట్టింది. సడెన్ బ్రేక్ వేయడం ఈ ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు. ఓపెన్ జీపు అద్దాలు పగిలిపోయాయి. రామ్మోహన్ గౌడ్ కు చేతికి గాయం కావడంతో రక్తం వచ్చింది. ఆయనను ఆసుప్రతికి తరలించారు.

loader