తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోరు మొదలైంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనుండగా... టికెట్ల కోసం కోట్లాట, పోట్లాట మొదలైంది.  టికెట్ దక్కించుకోవడానికి ఆశావాహులంతా ఎవరి ప్రయత్నాల్లో వారు మునిగితేలుతున్నారు. కాగా.. ఓ టీఆర్ఎస్ నేత మాత్రం ఏకంగా తనకు టికెట్ దక్కే అవకాశం లేదని... ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు.సికింద్రాబాద్, బోయినపల్లిలోని మంత్రి మల్లారెడ్డి కార్యాలయం వద్ద ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

Also Read:తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు .. సంక్రాంతి కానుక...

పూర్తి వివరాల్లోకి వెళితే... ఈ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. టికెట్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలటీలు, కార్పొరేషన్లకు చెందిన ఆశావాహులు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి మల్లారెడ్డిని కలిసేందుకు బోయిన్ పల్లిలోని  ఆయన ఇంటికి చేరుకున్నారు. 

ALSO READ: స్నేహితురాలిని ప్రేమ పేరుతో వంచన....గర్భవతిని చేసి చివరకు...

అప్పటికే టికెట్ల విషయంలో మంత్రి కార్యాలయంలో చర్చ  జరుగుతోంది.  అంతలోనే ఓ వ్యక్తి తనకు టికెట్ రాదని తెలుసుకున్నాడు. దీంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. వెంటనే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకొనే ప్రయత్నం చేశాడు. స్థానికులు గమనించి అతని ప్రయత్నాన్ని విరమించారు.  ఈ ఘటనతో మంత్రి మల్లా రెడ్డి ఇంటి వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.