రోడ్డు ప్రమాదంలో టీఆర్ఎస్ కీలక నేత మృతి చెందిన సంఘటన కీసర మండలంలో చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన మండల మాజీ వైస్‌-ఎంపీపీ బి.భరత్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. 

పూర్తి వివరాల్లోకి వెళితే..  మార్నింగ్‌ వాక్‌ చేయడానికి బైక్‌పై వెళ్తున్న భరత్‌రెడ్డిని గుర్తు తెలియని లారీ వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన చుట్టుపక్కలవారు ఆయనను జినియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భరత్‌రెడ్డి మృతిచెందినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రమాద దృశ్యాలు ఓ సీసీటీవీలో నమోదయ్యాయి. కాగా, భరత్‌రెడ్డి మృతిపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.