రేవంత్ రెడ్డి పీక పట్టిన టిఆర్ఎస్

First Published 23, Nov 2017, 1:50 PM IST
TRS knows where to hit revanth where it hurts asks him to resign then talk
Highlights
  • రెచ్చగొట్టి బుట్టలో వేసుకునే పనిలో టిఆర్ఎస్
  • రాజీనామా అంశాన్ని లేవనెత్తుతున్న వైనం
  • ఇరకాటంలోకి నెడుతున్న అధికార పార్టీ

గత మూడున్నరేళ్లుగా అధికార పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన రేవంత్ రెడ్డిపై అధికార టిఆర్ఎస్ పార్టీ పట్టు బిగించే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే ఒకసారి ఓటుకు నోటు కేసులో ఇరికించిన నేపథ్యంలో మరోసారి రేవంత్ ను రెచ్చగొట్టి చిత్తు చేసేందుకు కవ్వింపు చర్యలకు దిగుతున్నది. రాజీనామా అంశంలో రేవంత్ ను ఉక్కిరిబిక్కిరి చేసే ఉద్దేశంతో ఏకంగా ఆయన పీక పట్టుకుంది. తాజాగా శాసన మండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి టిఆర్ఎస్ఎల్పీలో మీడియాతో రేవంత్ పై ఘాటుగా విరుచుకుపడ్డారు. ఆయన మాటల్లోనే చదువుదాం....

సన్ బన్ షో కు అనుమతి ఇచ్చి కొలువుల కొట్లాటకు అనుమతి ఇవ్వటం లేదని రేవంత్ రెడ్డి అనటం అవగాహన రాహిత్యానికి నిదర్శనం. మ్యూజిక్ షో కు.. కొట్లాటకు తేడా తెలియదా.. ఈ షో కు ప్రభుత్వం అనుమతి ఇచ్చే వరకే మిగతా విషయాలతో సంబంధం ఉండదు. ఇతర రాష్ట్రాల్లో కూడా అక్కడ సమయ సందర్భాన్ని బట్టి ఈ షో లకు అనుమతులు ఇస్తున్నారు.

కావాలనే కొందరు కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. కేటీఆర్, ఆయన బామ్మర్ది కి సంబంధం లేని విషయం. అయినా ఆ కుటుంబంపై రుద్దుతున్నారు. ఇవి నేరపూరిత స్వభావం తో చేస్తున్న ఆరోపణలు తప్ప ఇంకోటి కాదు. నీ దగ్గర ఏమైనా ఆధారాలుంటే బహిరంగ చర్చకు రా..లేదంటే ముక్కు భూమికి రాస్తవా?  హైద్రాబాద్ .. డ్రగ్స్ జోన్ లో లేదనే విషయం తెలుసుకుంటే మంచిది. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా పబ్ లకు అనుమతులు ఇవ్వలేదు.

రేవంత్ రెడ్డి తో సహా కొంతమంది కాంగ్రెస్ నేతల పేకాట, గుడుంబా  వ్యాపారం మూసేసే సరికి ఆదాయం కోల్పోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నరు. పబ్ లలో డ్రగ్స్ అమ్ముతున్నారని అబద్దాలు చెబుతున్నారు. రేవంత్ తెలంగాణలో అభివృద్ధికి  చీడ పురుగులా అడ్డు పడుతున్నాడు. జైల్ లో కరుడుగట్టిన నెరస్థులను కలిసిన రేవంత్.. బయటికి వచ్చి అలాగే వ్యవహరిస్తున్నాడు.

రేవంత్ కు చిత్తశుద్ధి ఉంటే.. రాజీనామా డ్రామాను బంద్ చేయాలి. స్పీకర్ కు రాజీనామా లేఖ ఇవ్వాలి. రాజీనామా ఆమోదం పొందాలంటే ఇవ్వాల్సింది చంద్రబాబుకు కాదు. స్పీకర్ కు.. దమ్ము, ధైర్యం ఉంటే.. డ్రామా కట్టిపెట్టి రాజీనామా చేయి. కొడంగల్ ప్రజలు నిన్ను శంకరగిరి  మాన్యాలకు పంపుతారు. నువ్వు రాజీనామా చేస్తే కొడంగల్ లో టిఆర్ఎస్ గెలుపు ఖాయం. రేవంత్ , ఆయన బాస్ చంద్రబాబు ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్ళటం ఖాయం.

loader