Asianet News TeluguAsianet News Telugu

సిమెంటు పైపుల్లో మైక్రో ఇళ్లు.. నూతన ఆవిష్కరణలకు అండగా ఉంటాం : ఎమ్మెల్సీ కవిత (వీడియో)

తక్కువ ఖర్చుతో సిమెంటు పైపుల్లో ఇండ్లను నిర్మిస్తున్న యువతి పేరాల మానస రెడ్డిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. నూతన ఆవిష్కరణలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తోందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. 

TRS government in favor of new innovations :  MLC Kalvakuntla Kavitha - bsb
Author
Hyderabad, First Published Apr 12, 2021, 6:03 PM IST

తక్కువ ఖర్చుతో సిమెంటు పైపుల్లో ఇండ్లను నిర్మిస్తున్న యువతి పేరాల మానస రెడ్డిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. నూతన ఆవిష్కరణలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తోందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. 

"

ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్ లో కలిసిన మానస, కొత్త పద్దతిలో ఇండ్లను నిర్మిస్తున్న విధానాన్ని వివరించారు. మానస రెడ్డి భవిష్యత్తులో మరిన్ని నూతన ఆవిష్కరణలతో, రాష్ట్రానికి గర్వకారణంగా నిలవాలని ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు.

సిమెంటు పైపుల్లో మైక్రో ఇళ్లు...
కరీంనగర్‌ జిల్లా బొమ్మకల్‌ గ్రామానికి చెందిన పేరాల మానస రెడ్డి తెలంగాణ గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాలలో ప్రాథమిక విద్యాభాసం పూర్తి చేసింది. సివిల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పొందిన అనంతరం వివిధ దేశాల్లో అక్కడి వాతావరణానికి అనుగుణంగా, తక్కువ ఖర్చుతో ఇండ్లను నిర్మిస్తున్న విధానాలను అధ్యయనం చేసింది.

వాటి ఆధారంగా మన ప్రాంతంలోనూ తక్కువ ఖర్చుతో ఇంటి డిజైన్లను రూపొందించింది. రెండు వేల మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన కాంక్రీట్‌ పైపు (తూము)లో 120 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓపాడ్స్‌ లేదా మైక్రో ఇళ్లుగా పిలిచే ఇల్లును నిర్మించి ఔరా అనిపిస్తోంది. ఇండియాలోనే తొలిసారి నిర్మించే ఈ ఓపాడ్‌ ఇళ్లు 40 నుంచి 120 చదరపు అడుగుల విస్తీర్ణంలో 15 రోజుల్లో నివసించడానికి వీలుగా తయారవుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios