Asianet News TeluguAsianet News Telugu

బంగారు తెలంగాణలో వీళ్ల బాధలు పట్టవా ?

తెలంగాణ ఆవిర్భావం నాడే నిరసనకు దిగనున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ స్టాఫ్

TRS government failed to solve contract staff issue
  • Facebook
  • Twitter
  • Whatsapp

తెలంగాణ సాధించిన తర్వాత అన్న రంగాల్లో మెరుపు వేగంతో దూసుకుపోతున్నామని సర్కారు పెద్దలు ఒకవైపు ఘనంగా చెబుతున్నారు. కానీ మరోవైపు బంగారు తెలంగాణ పేరుతో తమకు బతుకులేకుండా చేస్తున్నారని చాలా వర్గాల వారు లబోదిబోమంటున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్ లైన్ తో తెలంగాణ తెచ్చుకుంటే నియామకాల విషయంలో పాలకులు చెప్పిన మాటలు వినసొంపుగా లేవని బాధితులు అంటున్నారు.

ఇక తెలంగాణ వస్తే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ అనే పదాలే వినబడకుండా చేస్తామన్నవారు ఆ ఉద్యోగులకు ఏమాత్రం మేలు చేయలేదని బాధిత కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇక సైలెంట్ గా ఉంటే లాభం లేదనుకున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పోరుబాటకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన తెలంగాణ తల్లి విగ్రహాల ముందు ఆందోళనలు చేయాలని సంకల్పించారు. తమ సమస్యలు.. చేయాల్సిన ఆందోళనా కార్యక్రమాలపై ఒక పోస్టును ఈ వర్గాల వారు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ పోస్టు యదాతదంగా కింద ఉంది చదవండి.

 

నాలుగేండ్ల నుండి మోసపోతున్న కాంట్రాక్ట్ ఉద్యోగ మిత్రుల్లారా....

 

 ఇప్పుడైనా మేల్కొనండి లేకుంటే ఈ ప్రభుత్వం మరో సంవత్సరం మనల్ని నిద్రావస్థాలోకి నెట్టేస్తుంది,  ప్రభుత్వ ఉద్యోగ సంఘాలన్ని ఏకమై బలప్రదర్శన చేసి వారి డిమాండ్లు సాదించుకుంటున్నారు, బలవంతులదే రాజ్యమన్నట్టు ప్రభుత్వం కూడా సంఖ్యా బలం ఉన్నోళ్ళకే చర్చలకు పిలుస్తుంది, ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ లలో క్రమబద్దీకరణ అంశం ఉన్నప్పటికీ వారి డిమాండ్లు నెరవేరాక మన అంశాన్ని పక్కనపెట్టి ఒకరినొకరు స్వీట్లు తీనిపించుకున్నది చూసే ఉంటారు, మన కోసం అందరిదీ మొసలి కన్నీరే, వేల..లక్షల జీతాలున్న వారికే ఇంకా వరాలిస్తుందీ ప్రభుత్వం, రెగులర్ చేస్తామని హామీనిచ్చి నాలుగేండ్లు గడిచిపాయే, రెగులర్ కాదు కదా కనీసం ఒక్క బెనిఫిట్ అన్నా చేసిందా ఈ ప్రభుత్వం ? జీతాలు పెంచామని అంటున్నారు, కనీసం అవైనా రెగులర్ వారితో సమానంగా ఇస్తుందా చెప్పమనండి ? ఆనాడు ఆంధ్ర పాలకుల చేతుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు శ్రమ దోపిడికి గురవుతున్నారని తెలంగాణలో రెగులర్ అవుతారని అన్నారు, తెలంగాణ వచ్చాక కూడా గత నాలుగేండ్ల నుండి శ్రమ దోపిడి చేస్తూనే ఉన్నారు .... మనం మోసపోతూనే ఉన్నాం, రెగులర్ కళ సాకారం కాక ముందే ఎంతో మంది అర్ధాంతరంగా మరణించారు, వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి, రేపు మనకూ ఆ పరిస్థితి రావచ్చు..!

 

 దాని కన్న ముందే మేల్కొందాం .... ప్రభుత్వాన్ని కూడా మేల్కొలుపుదాం

 

క్రమబద్దీకరణ అంశం కోర్టులో ఉన్నా కూడా ప్రత్యమ్నాయంగా ఉద్యోగ భద్రతా చట్టం చేయవచ్చు, కానీ ఆ దిశగా ప్రభుత్వం ఎప్పుడూ మన కోసం ఆలోచించ లేదు, మనలోని అనైక్యత వల్లే ప్రభుత్వం మనల్ని పట్టించుకోవడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖలలో ఉన్న కాంట్రాక్ట్ & ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏకమై ప్రదర్శన నిర్వహిస్తే లక్ష మందితో మన బలాన్ని చూయించవచ్చు!

 

రాష్ట్రవతరణ(జూన్ 2) సంధర్భంగా ప్రభుత్వం రెగులర్ ఉద్యోగులకు వరాలు ప్రకటించబోతుంది..! అదే రోజు మనకూ న్యాయం చేయాలి, లేకుంటే ఆ రోజు నుండే నిరసనలతో ఉద్యమాలకు శ్రీకారం చుడుదాం, రానున్న ప్రతి ఎలక్షన్ లొ మన ప్రభావం ఎంటో చూపిద్దాం.

 

జూన్ 2 నాడు జిల్లా మరియు నియోజక వర్గ కేంద్రాలలో తెలంగాణ తల్లి విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమంతో మన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెలుదాం, దీనికి ప్రతి శాఖ లోని కాంట్రాక్ట్ & ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కదలాలి.

 

💥మీది ఏ శాఖ అయినా సరే, ఏ సంఘమైనా సరే, ఒకే రోజు ఇలా అన్ని జిల్లాలలో చేసినట్లైతే మీడియా ద్వారా సమాచారం వెళుతుంది, ప్రభుత్వం ఆలోచనలో పడుతుంది. నాయకులు మరియు సభ్యులందరు ఆలోచించండి, చర్చించండి.💥

 

(ప్రతి కాంట్రాక్ట్ & ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఈ మెసెజ్ చేరే వరకు షేర్ చేయండి)

Follow Us:
Download App:
  • android
  • ios