Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్ కు రూ.80కోట్లతో సొంత చార్టర్డ్ ఫ్లైట్.. దేశవ్యాప్త సుడిగాలి పర్యటనకు కేసీఆర్ రెడీ..

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టబోతున్న తరుణంలో ఆ పార్టీ సొంతంగా విమానం కొనుగోలు చేయాలనే నిర్ణయానికి వచ్చింది. దేశవ్యాప్త సుడిగాలి పర్యటనలకోసం 12 సీట్లతో కూడిన సొంత విమానం కొనుగోలు చేయనుంది. 

TRS going to buy own chopper for cm kcr national tour
Author
First Published Sep 30, 2022, 6:46 AM IST

హైదరాబాద్ :  ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుకు సన్నద్ధం అవుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ గురువారం ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీ అధినేత కేసీఆర్ దేశవ్యాప్త పర్యటన కోసం ప్రత్యేకంగా ఒక చార్టెడ్ ఫ్లైట్ కొనుగోలు చేయనుంది. ఇందుకోసం రూ. 80 కోట్లను వెచ్చించేందుకు ఆ పార్టీ సిద్ధమైంది. 12 సీట్లతో కూడిన ఈ విమానం కొనుగోలుకు సంబంధించి దసరా పర్వదినాన ఆర్డర్ ఇవ్వాలని ఆ పార్టీ నిర్ణయించింది. దసరా రోజున (అక్టోబర్ 5)  కొత్త పార్టీ పేరు ప్రకటన తర్వాత ప్రత్యేక విమానం కొనుగోలుకు పార్టీ నుంచి ఆర్డర్ ఇవ్వనున్నట్లు సమాచారం.  

పార్టీ  ఖజానాలో ఇప్పటికే రూ. 865 కోట్ల మేర నిధులున్నాయి. అయినా విమానం కొనుగోలుకు విరాళాలు సేకరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రస్తుతం వివిధ రాష్ట్రాల పర్యటనలకు ప్రైవేట్ విమానాలను అద్దెకు తీసుకుని వినియోగిస్తున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో సొంత విమానం అవసరమని ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. 2001లో టిఆర్ఎస్ను ప్రారంభించాక హెలికాప్టర్ ను వినియోగించడం ద్వారా పార్టీ బలోపేతానికి దోహదం చేసిందని.. దాని ద్వారా గుర్తింపు వచ్చిందని.. ఇప్పుడు సొంత విమానం వాడటం ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని ఆయన పార్టీ నేతలతో పేర్కొన్నట్లు సమాచారం.

హైదరాబాద్‌లో ఫ్రెంచ్ సంస్థ ష్నైడర్ ఎలక్ట్రిక్ స్మార్ట్ ఫ్యాక్టరీ.. రూ.300 కోట్ల పెట్టుబడులు

ఈ విమానం ద్వారా దేశమంతా సుడిగాలి పర్యటన కోసం కేసీఆర్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక విమానం కొనుగోలుకు విరాళాలు ఇచ్చేందుకు నేతలు పోటీ పడుతున్నారు. ఈ విమానం కొనుగోలుతో సొంత విమానం కలిగి ఉన్న రాజకీయ  పార్టీగా టిఆర్ఎస్ కు గుర్తింపు లభించనుంది. దసరా రోజున జాతీయ పార్టీ ప్రకటన, ఆ తర్వాత స్పెషల్ అజెండా సెట్ చేసుకుని అజెండాను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు సుడిగాలి పర్యటన చేయడం కేసీఆర్ షెడ్యూల్ గా ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే టిఆర్ఎస్ జాతీయ పార్టీ ప్రకటనపై విపక్షాల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. సీపీఐ దీన్ని స్వాగతిస్తుండగా..బిజెపి, కాంగ్రెస్లో వ్యతిరేకిస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ ఎంటర్ అయితే ఎలా ఉంటుందో.. అని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios