Asianet News TeluguAsianet News Telugu

సనత్ నగర్ ఉపఎన్నికకు టిఆర్ ఎస్ సిద్ధమవుతున్నదా?

 ఈ రోజు రాష్ట్ర ఐటి మంత్రి కెటి రామారావు,  సనత్ నగర్ పర్యటన చూస్తే అక్కడ ఉప ఎన్నికకు తెలంగాణా రాష్ట్ర సమితి సిద్ధమవుతున్నదనే అనుమానం వస్తుంది. అంబేద్కర్ జన్మదినం సందర్భంగా ఆదయ్య నగర్ లో ఒక కార్యక్రమంలో పాల్గొని, ప్రజలతో ముఖాముఖి నిడిపి, వరాలిచ్చి,  పార్టీకి, ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు.

TRS getting ready for Sananth nagar byelections

ఉప ఎన్నికలకు బయపడుతున్నారని, ఓడిపోతారనే భయంతో తలసాని శ్రీనివాసయాదవ్ (సనత్ నగర్) వంటి టిడిపి ఎమ్మెల్యేల చేత రాజీనామాచేయించకుండా తప్పించు తిరుగుతున్నారనే విమర్శకు టిఆర్ ఎస్ సరైన సమాధానం ఇవ్వాలనుకుంటున్నదా.

 

 ఈ రోజు రాష్ట్ర ఐటి మంత్రి కెటి రామారావు, సనత్ నగర్ పర్యటలనుచూస్తే అక్కడ ఉప ఎన్నికకు తెలంగాణా రాష్ట్ర సమితి సిద్ధమవుతున్నదనే అనుమానం వస్తుంది. అంబేద్కర్ జన్మదినం సందరర్భంగా సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అదయ్య నగర్ లో  తిరిగి,  పార్టీకి, ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు.

 

 ఆదయ్యనగర్ మైదానంలో అంబేద్కర్ జయంతి వేడుకలలో  మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ  కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, ఎంపీలు బాల్క సుమన్, మల్లారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు . విద్యార్థులు, బస్తి వాసులతో స్థానిక సమస్యలపై మంత్రి కేటీఆర్ చర్చలు జరిపారు. చాలా సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించారు. ఆయన ఇచ్చిన హామీలు  చూడండి:

 

స్థానిక లైబ్రరీని అత్యంత ఆధునికంగా3 కోట్ల నిధులతో డిజిటల్ లైబ్రరీ గా తయారు చేస్తామని, ఆదయ్య నగర్ బస్తీలో ఉన్న పాఠశాలలో ఆధునిక క్లాస్ రూమ్ ల నిర్మాణానికి 25 లక్షలు మంజూరు చేస్తామని కెటిఆర్ చెప్పారు.

 

వారం రోజుల్లో మున్సిపల్ క్వార్టర్స్ ను ఫ్రీ హోల్డ్ చేసి అనుమతులు ఇస్తామని హామీ ఇచ్చారు.

 

ప్రజల దీవెన, ఆశీస్సులు ఉండాలి ప్రభుత్వానికి ఉండాలని కోరారు.

 

 ఇపుడు ఉన్నట్లుండి ప్రజల అండ ఎందుకు కోరుతున్నట్లు అనేది ప్రశ్న. శ్రీనివాస్ యాదవ్ కు గాని,ప్రభుత్వానికి వచ్చిన  కష్టాలేమీ లేవుగా.

 

అందుకే ఉప ఎన్నిక అనుమానం వస్తున్నది.కెటిఆర్ పర్యటన తర్వాత రాజకీయ వర్గాలలో ఈ చర్చ మొదలయింది.  శ్రీనివాస్ యాదవ్ చేత రాజీనామా చేయించేందుకు  అక్కడినుంచి 2014లో కాంగ్రెస్ పోటీ చేసి ఓడిపోయిన మర్రి  శశిధర్  చాలా కాలంగా అన్ని రకాల పోరాటాలుచేస్తున్నారు. తెలుగుదేశం కూడా గవర్నర్ మీద వత్తిడి తీసుకువస్తున్నది. కాంగ్రెస్ కూడా ‘ ధైర్యం  వుంటే ముఖ్యమంత్రి కెసిఆర్ ఫిరాయింపు దారుల చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు సిద్ధంకావాలి’ అని సవాల్ విసురుతూనే ఉంది. 

 

ఒక వారం కిందట శ్రీనివాస్ యాదవ్ నేరుగా ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సవాల్ విసిరారు. నేను రాజీనామా చేస్తే, ఆంధ్రలో టిడిపిలోకి ఫిరాయించిన వైసిపి ఎమ్మెల్యేల చేత కూడా రాజీనామా చేయిస్తారు అని నిలదీశారు. 

 

ఉప ఎన్నికంటూ వస్తే నడిపించాల్సింది కెటిఆర్ కాబట్టి,  ఈ రోజు కార్యక్రమానికి ఆయనను ముఖ్యఅతిధిగా పిలిచారా?

 

సనత్ నగర్ వంటి చోట ఉప ఎన్నికల పోటీ చేస్తే  గాలి ఎటు వీస్తున్నదో స్పష్టంగా తెలుస్తుంది. ఒక వేళ  శ్రీనివాస్ యాదవ్ తిరుగు మెజారిటీ గెలిస్తే అదెటువైపయినా వెళ్ల వచ్చు. మొత్తం ఫిరాయింపు దారుల చేత రాజీనామా చేయించవచ్చు, లేదా ప్రచారంలో ఉన్నట్లు ప్రతిపక్షాల నోరుమూయించేందుకు, కోదండ్ రామ్ ఉద్యమాలను మధ్యలోనే ఫినిష్ చేసేందుకు  ముందస్తుఎన్నికలకు పోవచ్చు.

 

ఇంత రాజకీయముంది ఈ రోజు కెటిఆర్ పర్యటన, హామీల వెనక అని రాజకీయం తెలిసిన వాళ్లు అనుమానిస్తున్నారు.

 

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios