ఈ నెల 27న హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడకలు జరగనున్నాయి. . ఆవిర్భావ సమావేశంలో 13 తీర్మానాలను ఆమోదించనున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలను ఆహ్వానించనున్నారు. 

ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు (trs foundation day0 నిర్వహించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. హైదరాబాద్ మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో (hicc) వేడుకలు జరగనున్నాయి. ఉద‌యం 10 నుంచి 11 గంట‌ల వ‌ర‌కు పార్టీ ప్ర‌తినిధుల పేర్ల న‌మోదు కార్య‌క్ర‌మం కొన‌సాగనుంది. ఉద‌యం 11:05 గంట‌ల‌కు పార్టీ అధ్య‌క్షులు కేసీఆర్ స‌భా ప్రాంగ‌ణానికి చేరుకుని, పార్టీ జెండాను ఆవిష్క‌రిస్తారు. అనంత‌రం స్వాగ‌తోప‌న్యాసం ఉంటుంది. ఆ త‌ర్వాత అధ్య‌క్షులు కేసీఆర్ మాట్లాడుతారు. దాదాపు 11 తీర్మానాల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. తీర్మానాల‌ను చ‌ర్చించి ఆమోదం తెలుప‌నున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలను ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించనున్నారు. ఉదయం 11.05 గంటలకు టీఆర్ఎస్ పతాక ఆవిష్కరణ చేయనున్నారు. 

2001లో ఏప్రిల్ 27న ఆవిర్భవించింది తెలంగాణ రాష్ట్ర సమితి (TRS). హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న జలదృశ్యంలో కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పురుడు పోసుకుంది. 2001 ఏప్రిల్ 27న ఆ పార్టీ ఆవిర్భవించింది. నాటి కార్యక్రమంలో పాల్గొన్నవారిలో అత్యధికులు 1969 నాటి ఉద్యమకారులు, విద్యావంతులు, మేధావులే. పార్లమెంటరీ పంథాలో తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా టీఆర్ఎస్ ఆవిర్భవించింది. రాష్ట్రంలో యువతను, పెద్దలను, మేధావులను, రాజకీయ పార్టీలను ఏక తాటిపై నడిపించారు కేసీఆర్ (kcr) . 

ప్రతీ ఏటా ఘనంగా నిర్వహించే టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాలు.. గడిచిన రెండేళ్లుగా కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా జరిగాయి. గతేడాది కూడా హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ప్రతిచోటా కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు గులాబీ జెండాలను ఎగురవేయాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ కోరిన సంగతి తెలిసిందే. పార్టీ ఆవిర్భావం నుంచీ టీఆర్ఎస్ పార్టీ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. ప్లీనరీ, భారీ బహిరంగ సభలు జరుపుతోంది. 2019లో పార్లమెంటు ఎన్నికల కారణంగా వాటిని నిర్వహించలేదు. 2020లో కరోనా వల్ల సభ, ప్లీనరీలను రద్దు చేసింది.