ఖమ్మం జల్లా కొత్తగూడెం మండలానికి చెందిన టీఆర్ఎస్ నేత నల్లారి శ్రీనివాసరావును మావోలు హతమార్చిన  విషయం తెలిసిందే.  ఈ నెల8వ తేదీ అర్ధరాత్రి కొందరు సాయుదులైన మావోయిస్టులు అతన్ని కిడ్నాప్ చేశారు. అయితే నిన్న(శుక్రవారం) అతడి మృతదేహాన్ని తెలంగాణ –చత్తీస్ గడ్ సరిహద్దుల్లో ఎర్రంపాడు, పొట్టెపాడు గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో పోలీసులు గుర్తించారు. రక్తపుమడుగులో పడివున్న శ్రీనివాస రావు మృతదేహం పక్కనే మావోయిస్టుల పేరుతో ఓ  లేఖ లభ్యమయ్యింది. దీన్ని  బట్టి అతడు ఇన్ఫార్మర్ అన్న అనుమానంతోనే మావోలు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అర్థమవుతోంది. 

నల్లారి శ్రీనివాసరావును పోలీసులకు ఇన్ఫార్మర్‌  గా వ్యవహరిస్తున్నాడే హతమార్చినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా అతడు తమకు వ్యతిరేకంగా వివిధ గ్రామాల్లో మరికొంత మంది ఇన్ఫార్మర్లను తయారుచేస్తున్నాడు. ఇలా మావోయిస్టు కార్యకలాపాలకు అడ్డుతగులుతూ పోలీసులకు సహకరిస్తున్న తమ వద్ద పక్కా సమాచారం వుండటం వల్లే అతడి ప్రాణాలు తీయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. 

తమకు అనుకూలంగా వున్నట్లుగా వ్యవహరిస్తూనే శ్రీనివాసరావు దళాల సమాచారం ఎప్పటికప్పుడు పోలీసులకు చేరవేస్తున్నాడు. అలాగే ప్రజా సంఘాల నాయకులను  తన పలుకుబడి ఉపయోగించి అక్రమంగా  అరెస్ట్‌ చేయిస్తున్నాడని  తెలిపారు. అంతేకాకుండా అధికారులు, పోలీసులు అండదంండలతో అదివాసీలకు సంబంధించిన 70 ఎకరాల భూములను అక్రమంగా స్వాధీనం చేసుకున్నాడని ఆరోపించారు. అంతేకాకుండా అదివాసీ వారికి నాయకత్వం వహిస్తున్న మావోయిస్టు పార్టీకి అడ్డుగా నిలవడంతో శ్రీనివాసరావును ఖతం చేశాం అంటూ చర్ల-శబరి ఏరియా కమిటీ  పేరుతో ఈ లేఖను విడుదల చేశారు.