Asianet News TeluguAsianet News Telugu

సిద్దిపేట జిల్లాలో టీఆర్ఎస్‌కు షాక్....తాజా మాజీ ఎమ్మెల్యేను అడ్డుకున్న గ్రామస్థులు

సిద్దిపేట... ఈ జిల్లా టీఆర్ఎస్ పార్టీకి కంచు కోట. ప్రస్తుత సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు ఈ నియోజకవర్గం నుండి ప్రాతినిద్యం వహించినవారే. ఈ జిల్లాలో టీఆర్ఎస్ కు మంచి పట్టుంది. మంత్రి హరీష్ ఈ జిల్లాపై ప్రత్యేక శ్రద్ద కనబరుస్తుంటారు.  అలాంటిది ఈ జిల్లాలోనే ఓ గ్రామంలో టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యేను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ ఘటన టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్ణణకు దారితీసింది. ఈ పరస్పర దాడులతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.   
 
trs, congress supporters fight in siddipet district
Author
Siddipet, First Published Oct 3, 2018, 2:41 PM IST

సిద్దిపేట... ఈ జిల్లా టీఆర్ఎస్ పార్టీకి కంచు కోట. ప్రస్తుత సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు ఈ నియోజకవర్గం నుండి ప్రాతినిద్యం వహించినవారే. ఈ జిల్లాలో టీఆర్ఎస్ కు మంచి పట్టుంది. మంత్రి హరీష్ ఈ జిల్లాపై ప్రత్యేక శ్రద్ద కనబరుస్తుంటారు.  అలాంటిది ఈ జిల్లాలోనే ఓ గ్రామంలో టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యేను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ ఘటన టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్ణణకు దారితీసింది. ఈ పరస్పర దాడులతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.   

ఈ  ఘర్షనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ సిద్దిపేట జిల్లాలోని గోవర్ధనగిరి గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లాడు. అయితే ఇతడిని గ్రామంలోకి రాకుండా గ్రామస్తులు, కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ ఊరిలో టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ది ఏమీ లేదని..కాబట్టి గ్రామంలో అడుగుపెట్టవద్దంటూ నిరసనకు దిగారు.

దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలకు మద్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. దీంతో ఇరువర్గాలు పరస్పరం దాడికి దిగారు. ఈ ఘర్షనలో మహిళలు కూడా పాల్గొనడంతో గ్రామం రణరంగంగా మారింది. ఈ ఘర్షనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. 

ఈ గొడవపై సమాచారం అందడంతో స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ గొడవలో గాయపడిన వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. 
 
Follow Us:
Download App:
  • android
  • ios