కరీంనగర్‌లో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఇంటి ముట్టడికి టీఆర్ఎస్ కార్యకర్తలు యత్నించారు. ఒక్కసారిగా 50 మంది వరకు టీఆర్ఎస్ కార్యకర్తలు బండి సంజయ్ నివాసం వైపుకు దూసుకొచ్చారు.
కరీంనగర్‌లో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఇంటి ముట్టడికి టీఆర్ఎస్ కార్యకర్తలు యత్నించారు. ఒక్కసారిగా 50 మంది వరకు టీఆర్ఎస్ కార్యకర్తలు బండి సంజయ్ నివాసం వైపుకు దూసుకొచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకన్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక, టీఆర్‌ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకన్న పోలీసులు అక్కడి నుంచి తరలించారు.
ఇక, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ కవిత పాత్ర ఉందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీజేపీ కార్యకర్తలు సోమవారం హైదరాబాద్‌లోకి కవిత ఇంటి ఎదుట నిరసనకు దిగారు. దీంతో పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేవారు. వారిపై వివిధ సెక్షన కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు బండి సంజయ్ పిలుపునిచ్చారు. అయితే ఈ రోజు ఉదయం జనగామ జిల్లా పామ్నూర్‌లో పాదయాత్ర శిబిరం వద్ద పోలీసులు బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారు. ముందస్తుగా ఆయనను అరెస్ట్ చేసిన కరీంనగర్‌కు తరలించారు. అయితే బండి సంజయ్‌ను అరెస్ట్ చేస్తున్న సమయంలో.. పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.
ఇదిలా ఉంటే కరీంనగర్‌లోని తన నివాసంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కూతురిని కాపాడుకునేందుకు ప్రజా సంగ్రామ పాదయాత్ర అడ్డుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ ప్రజాసంగ్రామ యాత్రకు విశేష స్పందన వస్తుందని చెప్పారు. ప్రజాసంగ్రామ యాత్రకు వస్తున్న స్పందన చూసి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భయపడుతున్నారని అన్నారు. లిక్కర్ స్కామ్ నుంచి దృష్టి మరల్చేందుకు యాత్రను అడ్డుకున్నారని విమర్శించారు.
కేసీఆర్‌కు నిజాయితీ ఉంటే ఆయన కూతురు కవితను సస్పెండ్ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కూతురుకు ఓ న్యాయం, ఇతరులకు మరో న్యాయమా? అని ప్రశ్నించారు. ఇన్ని రోజులుగా పాదయాత్ర సాగుతుంటే.. ఇప్పుడే సమస్య ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఈ రోజే తమ పాదయాత్రను అడ్డుకోవడానికి కారణం ఏమిటో చెప్పాలని కోరారు.
