మునుగోడులో బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడం కలకలం రేపుతోంది. ఈ ఘటనలో ఈటల గన్‌మెన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతనిని ఆసుపత్రికి తరలించారు.
మునుగోడులో బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడం కలకలం రేపుతోంది. ఈ ఘటనలో ఈటల గన్‌మెన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతనిని ఆసుపత్రికి తరలించారు. మునుగోడు మండలం పలివెలలో ఈ రాళ్లదాడి జరిగింది. దీంతో టీఆర్ఎస్- బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ జగదీశ్ సహా పలువురికి గాయాలయ్యాయి. రాళ్లదాడిలో ఈటల కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
