మేడారం: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండగ సమ్మక్క - సారలమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర గిరిజన, మహిళా శిశు  సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. 

సమ్మక్క-సారలక్క జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మేడారంలో జాతర ఏర్పాట్లపై మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమ్మక్క-సారలక్క జాతరను జాతీయ పండుగగా గుర్తించేందుకు కావాల్సిన అన్ని  జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.  

2020 ఫిబ్రవరి 5,6,7 మూడురోజుల్లో జరిగే సమ్మక్క - సారలమ్మ జాతరను అత్యంత వైభవంగా కన్నుల పండువగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం ఉన్నా జాతర కోసం రూ. 75కోట్లు కేటాయించినందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. 

ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ప్రతీ రూపాయి బాధ్యతతో ఖర్చుపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. జాతర కు వచ్చే భక్తులు, వి.ఐ. పిల పార్కింగ్ ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. మరో నెల రోజులలో పంటలు పూర్తి అవుతాయని ఆ తర్వాత పార్కింగ్ ప్రాంతాలను సిద్ధం చేస్తారని తెలిపారు.  


గతంలో జరిగిన మూడు జాతరలకు అత్యధికంగా నిధులు విడుదల చేసి రాష్ట్ర పండుగగా కేసీఆర్ గుర్తించారని ఆమె తెలిపారు. రూ.5 కోట్ల రూపాయలను ఖర్చు చేసి భూ సేకరణ చేయాలని కలెక్టర్ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 

అవసరమైన పనులు గుర్తించి, టెండర్లు పిలిచి, నాణ్యత లోపించకుండా పనులు నిర్వహించే విధంగా చూడాలని ఆదేశించారు. ఈ జాతర వైభవాన్ని చెప్పే విధంగా డాక్యుమెంటరీ లను రూపొందించాలని, జాతరకు దగ్గర్లో ఉన్న  దర్శనీయ ప్రాంతాల గురించి ప్రచారం చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. 

వీఐపీలకు ఈసారి ముందే ఆహ్వానం పంపాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ జాతరను ప్లాస్టిక్ ఫ్రీగా చేయాలని, సైన్ బోర్డ్స్ ని కాగితం, దుస్తుల బోర్డ్ లతో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. 


ప్రతి 15 రోజులకు ఒకసారి మేడారం జాతర పై సమీక్ష చేస్తామని తెలియజేశారు. దేశంలోని గిరిజన నేతలందరిని ఆహ్వానించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రతి పనిని భక్తులను దృష్టిలో పెట్టుకొని చేయాలని, ఈ జాతరకు వచ్చిన భక్తులకు చిన్న ఇబ్బంది కూడా జరగకుండా అధికారులంతా సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.  


సమ్మక్క - సారలమ్మ జాతర విశిష్టత, సంప్రదాయాలను కాపాడుతూనే దీనిని జాతీయ పండుగగా గుర్తించే స్థాయిలో ఏర్పాట్లు ఉండాలని సూచించారు. జాతరలోపు పూర్తయ్యే పనులను మాత్రమే శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలని, మిగిలినవి తాత్కాలికంగా నిర్వహించాలని సూచించినట్లు మంత్రి తెలిపారు. 

జాతరకు వచ్చే మహిళా భక్తులకు స్నాన గదులు, మరుగుదొడ్ల వసతులు సరిపడా కల్పించాలని, భద్రత విషయంలో పక్కా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అనుకున్న సమయంలో పనులు కచ్చితంగా పూర్తి చేయాలని 

పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం ఉంటే సహించేది లేదని హెచ్చరించారు. వచ్చే భక్తునికి వెళ్ళేటప్పుడు అమ్మవార్ల ప్రసాదం ఇచ్చే విధంగా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. 

భద్రాచలం లో రాములవారి కళ్యాణ సమయంలో చేసినట్లు మన అమ్మవార్ల దగ్గరకు వెళ్లి కానుకలు, మొక్కులు సమర్పించలేని భక్తుల వద్దకే వెళ్లి వాటిని స్వీకరించి అమ్మవార్లకు సమర్పించే విధంగా వాలంటీర్లను ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలంటూ దిశానిర్దేశం చేశారు. 

అమ్మవార్లకు కోళ్లు, గోర్లు బలి ఇచ్చే ప్రదేశం ఎక్కడ పడితే అక్కడ కాకుండా కొన్ని నిర్దిష్ట ప్రాంతాలని నిర్ణయించాలి అన్నారు. జాతరకు వచ్చే విఐపి లకు కూడా ప్రత్యేక దర్శన సమయాలని కేటాయించి, ప్రచారం చేయాలన్నారు.

వీఐపీలకు ఇచ్చే పాసులు దుర్వినియోగం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జాతరలో ఏ, ఏ వసతులు ఎక్కడెక్కడ ఉంటాయో చెప్పే విధంగా ప్రచారం ముందు నుంచే చేయాలని సూచించారు.  అందుకోసం కాగిత ఫ్లెక్సీలు, ఎల్.ఈ. డి స్క్రీన్లు, కరపత్రాలు, పోస్టర్లు ముద్రించాలని సూచించారు.  

జాతర ఆహ్వాన పత్రికలు కూడా రూపొందించి ముఖ్యులను ఆహ్వానించాలని తెలిపారు. డిసెంబర్ నుంచి ఈ ఆహ్వన ప్రక్రియ ప్రారంభించాలన్నారు. జాతర విశిష్టత, సంప్రదాయాలను తెలిపే విధంగా టూరిజం శాఖ తో కలిపి సమన్వయం చేసుకుంటూ డాక్యుమెంటరీ ప్రదర్శించాలన్నారు. 

లేజర్ షో కూడా ప్లాన్ చేస్తే బాగుంటుందన్నారు. ప్లాస్టిక్ ఫ్రీ జాతరగా నిర్వహించాలని ఎవరైనా దుకాణ దారులు దీనిని పాటించకపోతే జరిమానా విధించాలని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే డిపాజిట్ కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 

జాతరలో ఫ్లెక్సీలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడొద్దని, అవసరమైతే కాగితం, దుస్తులను సైన్ బోర్డ్ లకు వినియోగించాలని కోరారు. జాతరను విస్తృతంగా సోషల్ మీడియా లో ప్రచారం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.  

జంపన్న వాగుపై వీలైనంత వరకు శాశ్వత రైలింగ్ ఏర్పాటుకు ప్రయత్నం చేయాలి అని మంత్రి సూచించారు. రోడ్ల మీద దుకాణాలు రహదారి దగ్గరగా పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, రోడ్డు మీద నిర్మాణాలు చేపట్టవద్దని, దీనిని అమలు చేయడం కోసం గ్రామ సభ పెట్టుకొని అందరి సాయం కోరండని సూచించారు.
read more  RTC Strike: ఆర్టీసీపై కీలక ప్రకటన... సమీక్షా సమావేశంలో కేసీఆర్ నిర్ణయమిదేనా..?

దుకాణాలు ఎక్కడ పెట్టుకోవాలో ముందే పక్కా ప్రణాళిక తో ఏర్పాటు చేయించాలని సూచించారు. జాతరకోసం పెట్టే లైట్స్ శాశ్వత ప్రాతిపదికన, తాత్కాలికంగా వేరు చేసి ఏర్పాటు చేసే విధంగా సమగ్ర నివేదిక ఇస్తే ముఖ్యమంత్రి కెసిఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి అమలయ్యే ప్రయత్నం చేస్తానన్నారు. 

ట్రాన్స్ ఫార్మర్ల వద్ద భక్తుల భద్రత కోసం కంచే తప్పకుండా వేయాలని  సూచించారు.త్వరలో విద్యుత్, ఆర్ అండ్ బి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి పక్కా ప్రణాళికతో డబ్బులు వృథా కాకుండా నిరోధించాలన్నారు. 

"

జాతరకు వచ్చే భక్తుల సౌకర్యర్థం ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు నడుపడం, పార్కింగ్ వసతులు పక్కగా ఉండేటట్లు ప్లాన్ చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా 
ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ చక్రధర్ రావు సమావేశాలకు వచ్చేటప్పుడు సన్నద్ధంగా రావడం లేదని, సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం గా ఉండడంపై మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అసహనం వ్యక్తం చేశారు. 

అధికారులను  సమన్వయం చేయడంలో ఇకపై నిర్లక్ష్యంగా ఉండొద్దని హెచ్చరించారు. ఆసియాలోనే అతిపెద్ద ఈ గిరిజన జాతరను జాతీయ పండుగ గా గుర్తించేందుకు యూనెస్కో ప్రతినిధులను ఆహ్వనించాలని సూచించారు ఎంపీ మాలోతు కవిత. 

read more బోటు ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలివే..: అధికారులకు సీఎం ఆదేశం

వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశంపై ప్రస్తావిస్తానని తెలిపారు. యునెస్కో ప్రతినిధులు వచ్చే విధంగా అధికారులు కూడా సహకరించాలని కోరారు. జాతరపై యునెస్కో కు ఇచ్చేందుకు నివేదిక రూపొందించాలని ఆదేశించారు. 

జాతరను సక్సెస్ చేసేందుకు మీకు కేటాయించిన పరిధిలో అధికారులంతా సమిష్టి కృషి తో వన దేవతలపై ఒక భక్తి భావంతో, సమన్వయంతో  పనులు చేయాలని కోరారు. పనుల నాణ్యతలో రాజీ పడొద్దని అలాగే అవసరమైన పనులు చేసుకోవడంలో కూడా ఆలోచించాల్సిన అవసరం లేదని సూచించారు ములుగు కలెక్టర్ నారాయణరెడ్డి. 

ట్రాఫిక్ లేకుండా చేస్తే సగం విజయవంతం అయినట్లేనన్నారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణకు సూక్ష్మంగా ఆలోచించి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. జంపన్న వాగు పై రైలింగ్, వాటర్ లెవెల్స్ ఎక్కువ లేకుండా జాగ్రత్త పడాలని, చిన్న సంఘటన కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 

ఇరిగేషన్ శాఖ చాలా శ్రద్ద తీసుకొని పని చేయాలని తెలిపారు. జాతర సందర్భంగా గిరిజన సంప్రదాయం తెలిపే విధంగా ట్రైబల్ విలేజ్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రైతులకు పంటలు, ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పరికరాల పై అవగాహన కల్పించే విధంగా స్టాల్ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. 

జాతరలో కాలుష్యం నివారణ కోసం బయో బైక్ లు వినియోగించనున్నట్లు తెలిపారు. గిన్నిస్ బుక్ రికార్డ్ వచ్చేలా ఒకేసారి 10 లక్షల మంది చేతులు శుభ్రం చేసుకునేలా ప్రత్యేక వసతి ఈ జాతర కోసం ప్లాన్ చేస్తున్నామని తెలిపారు.